AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iran israel conflict: అమెరికాపై ప్రతీకార దాడులు.. మిసైళ్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్!

తమ దేశంపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ అమెరికాపై దాడులకు పాల్పడింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌ ప్రతీకార దాడులు చేపట్టింది. ఖతార్‌, ఇరాక్‌, కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్‌ ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

iran israel conflict: అమెరికాపై ప్రతీకార దాడులు.. మిసైళ్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్!
Iran Attack
Anand T
|

Updated on: Jun 24, 2025 | 5:00 AM

Share

12 రోజుల యుద్దం ముగిసింది- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంపై ట్రంప్ కీలక ప్రకటన..

ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ఆయన పేర్కొన్నారు. సీజ్‌ ఫైర్‌కు రెండు దేశాలు అంగీకరించడంతో 12 రోజులుగా కొనసాగుతున్నయుద్దం ముగిసిందంటూ ట్రంప్ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ ద్వారా తెలిపారు. ఇప్పటికే రెండు దేశాలు కాల్పుల విరమణకు వచ్చాయని మరో 24 గంటల్లో పూర్తిగా యుద్దం ముగుస్తుందని ట్రంప్ పేర్కొన్నాడు.

IAEA తో సహకారాన్ని నిలిపివేసే యోచనలో ఇరాన్..

అంతర్జాతీయ అణుశక్తి సంస్థతో తన సహకారాన్ని నిలిపివేయాలని టెహ్రాన్ పరిశీలిస్తున్నట్టు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సోమవారం తెలిపారని కొన్ని నివేదికలు వచ్చాయి.  పార్లమెంటులో, “IAEAతో ఇరాన్ సహకారాన్ని నిలిపివేయడానికి తాము ఒక బిల్లును ఆమోదించాలని ప్రయత్నిస్తున్నామని అని స్పీకర్ మొహమ్మద్-బాగర్ గాలిబాఫ్ తెలిపినట్టు తెలుస్తోంది.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా పలు విమానాలు దారి మళ్లింపు..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పలు విమానయాన సంస్థలు తమ విమానాలను దారి మళ్లించాయి. దోహాలోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో భారతదేశం నుండి ఖతార్‌కు వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా, ఇండిగో విమానాలు రద్దయ్యాయి. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు విమాన సంస్థల తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి.

ఖతార్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ సంఘీభావం తెలిపారు…

ఖతార్ గడ్డపై ఇరాన్ దాడి తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఖతార్‌కు ఫ్రాన్స్ సంఘీభావం తెలిపారు. ఖతార్ అధికారులు మరియు ప్రాంతీయ భాగస్వాములతో తాను సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కొనసాగుతున్న గందరగోళాన్ని అంతం చేయడానికి అన్ని పార్టీలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని మరియు చర్చలకు తిరిగి రావాలని మాక్రాన్ కోరారు.

తమ గగన తలాన్ని మూసీవేసిన కువైట్..

ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాలులతో పచ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఈ నేపథ్యంలో కువైట్ ఎయిర్‌వేస్ సోమవారం దేశం నుండి వెళ్లే విమానాల సర్వీసులను నిలిపివేసినట్లు X వేదికగా తెలిపింది. దోహాలోని అల్ ఉదీద్ US సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేయడంతో ఖతార్ , బహ్రెయిన్‌లు తమ గగనతలాన్ని మూసివేసినట్టు వెల్లడించాయి.

ఇళ్లలోనే ఉండండి ఎవరూ బయటకు రావద్దు- ఖతార్‌లోని పౌరులు ఇండియన్ ఎంబసి వినతి..

దోహాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల తర్వాత  ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యింది. దోహాలోని భారతీయ పౌరులు ఖతార్ అధికారుల సూచనలు, మార్గదర్శకాలను పాటించాలని, ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండాలని, ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావొద్దని ఇండియన్ ఎంబసి పేర్కొంది.

ఏ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం: ఖతార్

దోహాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఖతార్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇరాన్‌ దాడుల సమాచారంపై తాజాగా అమెరికా స్పందించింది. ఖతార్ స్థావరంపై దాడి చేయడానికి ముందు ఇరాన్ ముందస్తు నోటీసు ఇచ్చిందని అమెరికా ధృవీకరించింది. ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై క్షిపణి దాడికి ముందే ఇరాన్ అమెరికా, ఖతార్ అధికారులకు సమాచారం ఇచ్చిందని అమెరికా రక్షణ శాఖ ధృవీకరించింది.

ఖతార్ వైమానిక స్థావరంపై దాడి చేసే ముందే ఇరాన్ అమెరికాను హెచ్చరించినట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆక్సియోస్ నివేదిక ప్రకారం ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై క్షిపణి దాడి చేయనున్నట్లు ఇరాన్ అమెరికాకు ముందుగానే తెలియజేసినట్టు తెలుస్తోంది. దాడి ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు ఇరాన్ రెండు దౌత్య మార్గాల ద్వారా హెచ్చరికను అందజేసిందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

తమ దేశంలోని అణు కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని అమెరికా చేసిన దాడులకు ఇరాన్ ప్రతికార దాడులు మొదటు పెట్టింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్న టెహ్రాన్‌ మిసైళ్లు క్షిపణులతో దాడులకు దిగింది. ఖతార్‌, ఇరాక్‌, కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపింది. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ అధికారికంగా వెల్లడించింది.

అమెరికాపై ఇరాన్ ప్రతికార దాడులను ప్రారంభించింది. దోహాలోని అమెరికా స్థావరంపై ఇరాన్ 6 మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. అయితే ఇరాన్ ప్రయోగించిన మిసైళ్ల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్‌ వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌ ప్రతీకార దాడులు విషయం తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెంటనే సిచ్యుయేషన్‌ రూమ్‌’కు చేరుకున్నారు. ఇరాన్‌ ప్రతీకార దాడులకు ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను ఆయన పరిశీలిస్తున్నారు.

మరోవైపు తమ దేశంపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ బెషారత్‌ ఫతా’ పేరుతో శక్తివంతమైన మిస్సైళ్లను అమెరికా స్థావరాలపై ప్రయోగించినట్లు ఇరాన్‌ ఆర్మీ దళాలు పేర్కొన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..