పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పద మృతి.. ధ్రువీకరించిన విదేశాంగశాఖ

|

Mar 07, 2022 | 7:53 AM

పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్‌ ఆర్య(Mukul Arya) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మేరకు విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్(S.Jayashankar) ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రమల్లాలోని భారత ప్రతినిధి...

పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పద మృతి.. ధ్రువీకరించిన విదేశాంగశాఖ
Mukul Arya
Follow us on

పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్‌ ఆర్య(Mukul Arya) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మేరకు విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్(S.Jayashankar) ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రమల్లాలోని భారత ప్రతినిధి ముకుల్‌ ఆర్య మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి ట్వీట్ చేశారు. ముకుల్ ఎంతో తెలివైన, ప్రతిభావంతుడైన అధికారి అని, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానన్నారు. భారత రాయబారి ముకుల్‌ మృతిపై పాలస్తీనా(Palastine) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముకుల్‌ మృతి చెందారన్న వార్త తెలియగానే.. ఆ దేశ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌, ప్రధాని మహమ్మద్‌ ష్టాయే అధికారులను అప్రమత్తం చేసినట్లు అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. వెంటనే భారత రాయబార కార్యాలయానికి చేరుకొని ఆయన మరణానికి గల కారణాలను నిశిత పరిశీలన చేయాలని ఆదేశించామని పేర్కొంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్ని రకాలుగా సహాయం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ముకుల్‌ భౌతికకాయాన్ని తరలించేందుకు భారత విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.

2008 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌కు చెందిన ముకుల్‌ ఆర్య దిల్లీలోని జవహర్‌లాల్‌ యూనివర్సిటీలో చదివారు. ముకుల్‌ అంతకుముందు కాబుల్‌, మాస్కోల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో, దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించారు. ప్యారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో సైతం పనిచేశారు. ముకుల్‌ మరణం పట్ల పాలస్తీనా విదేశాంగశాఖ మంత్రి రియాద్‌ అల్‌ మాలికీ భారత విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌కు, భారత ప్రభుత్వానికి, ఆర్య కుటుంబ సభ్యులకు తన సానుభూతి వ్యక్తం చేశారు.

Also Read

Women’s Day-TSRTC: మహిళలకు బంపర్ ఆఫర్లు ఇచ్చిన టీఎస్ఆర్టీసీ.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా..

Telangana CM KCR: కేసీఆర్ మదిలో ఆ ఆలోచన ఉందా?.. విపక్షాల ఉరుకులు పరుగులు అందుకోసమేనా?..

పొలం పనులు చేస్తుండగా చేతికి తాకిన వస్తువు.. ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్..!