G20 Summit: మొదటిసారిగా ఎదురుపడిన ప్రపంచ నాయకులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..

| Edited By: Janardhan Veluru

Nov 15, 2022 | 4:14 PM

భారత సంతతికి చెందిన రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండోనేషియా రాజధాని బాలి కేంద్రంగా..

G20 Summit: మొదటిసారిగా ఎదురుపడిన ప్రపంచ నాయకులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..
Modi And Sunak
Follow us on

భారత సంతతికి చెందిన రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండోనేషియా రాజధాని బాలి కేంద్రంగా జరుగుతున్న జీ20 సదస్సులో ఇరు దేశాల ప్రధానులు మొట్టమొదటి సారిగా కలిశారు. సభ్య దేశాధినేతలు హాజరవడంతో మంగళవారం జీ20 సదస్సు ప్రారంభమయింది. సదస్సు ప్రారంభమయిన తొలి రోజే వీరిద్దరు కలవడంతో అందరి ద‌ృష్టి వీరి పైనే పడింది. ఈ సదస్సులో మోదీ కనిపించిన వెంటనే రిషి సునాక్ స్వయంగా వచ్చి భారత ప్రధానిని పలకరించారు. అధికారికంగా కాకున్నా సందర్భానుసారంగా కలిసిన ఈ ఇరువురు కొంతసేపు సరదాగా మాట్లాడుకున్నారు. కానీ జీ20 సదస్సులోని సభ్య దేశాల అధినేతలతో మోడీ అధికారిక చర్చలు జరుపనున్నారు. ఈ క్రమంలోనే భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు బుధవారం జరగుతాయి. ఈ చర్చల్లో ఆయా దేశాల అధికార ప్రతినిధులతో కలిసి ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని సునాక్ భాగస్వాములవబోతున్నారు.

ఒకే దేశానికి చెందిన ప్రపంచ స్థాయి నాయకులు కావడంతో ఆదరాభిమానాలతో ఇరువురూ పరస్పరం పలకరించుకున్నారు. అనంతరం మోదీ జీ20 లోగోను అవిష్కరించారు.భారత సంతతికి చెందిన రిషి సునాక్, మన దేశంలోని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులల్లో ఒకరైన నారాయణ మూర్తికి అల్లుడు. రిషి సునాక్ అక్టోబర్ 18న బ్రిటన్ పదవిగా బాధ్యతలు చేపట్టాడని తెలియగానే భారతీయులంతా సంతోషించడానికి ఇది కూడా ఒక కారణం. మన దేశ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింతగా బలపడతాయని అందరూ ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్..

సునాక్, మోదీ కలయిక అలాంటి ఆలోచనలకు బలం చేకూర్చినట్లయింది. రిషితో జరిగిన కలయికకు ముందుగానే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రొన్‌ను ప్రధాని మోదీ కలిశారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కొంత సమయం గడిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..