India-US Relations: మోదీ-బైడన్ వర్చువల్ భేటీ.. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై అమెరికా కీలక వ్యాఖ్యలు..

India-US Relations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సోమవారం వర్చువల్ ద్వారా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఇరు దేశాల అగ్రనేతలు పలు కీలక అంశాలపై చర్చించారు.

India-US Relations: మోదీ-బైడన్ వర్చువల్ భేటీ.. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై అమెరికా కీలక వ్యాఖ్యలు..
India Us
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 12, 2022 | 1:56 PM

India-US Relations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సోమవారం వర్చువల్ ద్వారా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఇరు దేశాల అగ్రనేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, ఇరు దేశాల భాగస్వామ్యం తదితర అంశాలపై ప్రధాని మోడీ, బైడన్ చర్చించారు. కాగా.. అగ్రనేతల (PM Modi – Joe Biden Meeting) భేటీ అనంతరం అమెరికా కీలక ప్రకటన చేసింది. రష్యా చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్ ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించలేదని మోదీ-బిడెన్ వర్చువల్ భేటీ తర్వాత అమెరికా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. వర్చువల్ సమావేశం అనంతరం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రాష్యా – ఉక్రెయిన్ పరిణామాల గురించి భారత్ తటస్థ వైఖరిపై అమెరికా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

అయితే.. మోదీ-బిడెన్ వర్చువల్ భేటీ తర్వాత వైట్ హౌస్ ప్రతినిధి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రష్యా నుంచి ఇంధన దిగుమతులు నిషేధించలేదు కానీ.. ఉక్రెయిన్‌లో యుద్ధం మధ్య యుఎస్ ఆంక్షలను ఉల్లంఘించవద్దంటూ పేర్కొన్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ పేర్కొన్నారు. అగ్రనేతల భేటీలో రష్యా నుంచి ఇంధన దిగుమతులను పరిమితం చేయాలని జో బిడెన్ భారత్‌ను కోరారా..? అని అడిగిన ప్రశ్నకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ స్పందిస్తూ.. ఇంధన దిగుమతులు నిషేధించలేదు.. వారు మా ఆంక్షలను ఉల్లంఘించవు. ప్రతి దేశం ఇలానే వ్యవహరిస్తుందని భావిస్తున్నాం అన్నారు. రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు కేవలం 1-2 శాతం మాత్రమే, వారు US నుండి 10 శాతం దిగుమతులు చేస్తున్నారు. ఈ కోనుగోళ్లు ఆంక్షల ఉల్లంఘన కాదంటూ జెన్ సాకీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ, భారతీయులకు వదిలేయండి అంటూ పేర్కొన్నారు.

అయితే.. రష్యా నుంచి దిగుమతులను పెంచడం భారతదేశానికి ప్రయోజనం కాదని జో బిడెన్ ఈ సమావేశంలో ప్రధాని మోదీకి చెప్పినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ పేర్కొంది.

చమురు దిగుమతులపై బ్లింగెన్, జైశంకర్

మరోవైపు రష్యా చమురును అదనంగా కొనుగోలు చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారత్‌ను కోరారు. “ప్రతి దేశం విభిన్నంగా ఉంటుంది, విభిన్న అవసరాలు, పరిస్థితులు ఉన్నాయి. అయితే మేము రష్యా ఇంధన కొనుగోళ్లను పెంచకుండా ఉండేందుకు మిత్రదేశాలు.. భాగస్వాములను కోరుతున్నామన్నారు.

దీనిపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. మీరు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను చూస్తున్నట్లయితే.. మీ దృష్టిని యూరప్‌పై కేంద్రీకరించాలని అమెరికాకు సూచించారు. డిమాండ్, భద్రతకు అవసరమైన చమురును కొనుగోలు చేస్తామని స్పష్టంచేశారు. దీనిలో ఏవరి ప్రమేయం అవసరం లేదని పేర్కొన్నారు.

Also Read:

Meat-eating: దేశంలో నాన్‌ వెజ్‌పై కొత్త వివాదం.. మాంసాహారం భారతీయుల ఆహారంలో భాగమేనా..?

Coronavirus: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే..?