
ఓ వైపు ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్‌పై ఎటాక్ చేస్తే.. ఇరాన్ కూడా అందుకు ధీటుగా బదులిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది. అమెరికా బేస్ క్యాంపులు ఉన్న బహ్రెయిన్, యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, ఇరాక్‌పై ఏకకాలంలో మిస్సైల్స్‌ను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా గల్ఫ్ మొత్తం యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం నెలకొన్న అస్థిర భద్రతా పరిస్థితుల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని భారతీయులకు గట్టిగా సూచించారు. తదుపరి సమాచారం ఇచ్చే వరకు ఇజ్రాయెల్‌లో అనవసరమైన ప్రయాణాలను పూర్తిగా నివారించాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించానలి కోరింది.
India in Israel (@indemtel) posts, “ADVISORY In view of the prevailing security situation in the region, all Indian nationals in Israel are advised to exercise utmost caution and remain vigilant at all times. 2. Indian nationals are strongly advised to strictly adhere to the… pic.twitter.com/EdHcnlVKx9
— Press Trust of India (@PTI_News) February 28, 2026
ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. అక్కడ నివసిస్తున్న భారతీయులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. అనవసరమైన ప్రయాణాలను, కదలికలను పూర్తిగా నివారించాలని సూచించింది. ‘‘ఎప్పటికప్పుడు తాజా వార్తలను గమనిస్తూ, పరిస్థితులపై అవగాహనతో ఉండాలి. రాయబార కార్యాలయం జారీ చేసే తదుపరి సూచనల కోసం వేచి ఉండాలి. ఏదైనా అత్యవసర సహాయం కోసం తమను సంప్రదించాలి’’ అని స్పష్టం చేసింది.
India in Iran (@India_in_Iran) posts Advisory issued by Embassy of India in Tehran.
“In view of the developing situation, all Indian nationals in Iran are advised to exercise utmost caution, avoid unnecessary movements. Indians may also continue to monitor the news, maintain… pic.twitter.com/N6GQwRU4sC
— Press Trust of India (@PTI_News) February 28, 2026
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, భారతీయులందరూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భద్రతా మార్గదర్శకాలను, అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని కార్యాలయం తెలిపింది. భారత రాయబార కార్యాలయం యథావిధిగా పనిచేస్తుందని, తదుపరి అప్‌డేట్‌ల కోసం అధికారిక ప్రకటనలను గమనించాలని కోరింది.
Embassy of India in Kuwait issues advisory for Indian nationals amid prevailing security situation. pic.twitter.com/K12gVxgevH
— Press Trust of India (@PTI_News) February 28, 2026
ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా, ఖతార్‌లోని భారతీయ పౌరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం సలహా ఇచ్చింది. రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు జారీ చేసే వార్తలు, సలహాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పింది. భారత రాయబార కార్యాలయం యథావిధిగా పనిచేస్తుందని.. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తమను సంప్రదించాలని కోరింది.
India in Qatar (@IndEmbDoha), “Advisory In view of the current regional situation, all Indian nationals in Qatar are advised to take due care, follow news and advisories as and when issued by the Embassy and local authorities. Our Embassy is continuing to function as usual.… pic.twitter.com/A1eoG7Hqu8
— Press Trust of India (@PTI_News) February 28, 2026
అంతేకాకుండా అబుదాబి, జోర్డాన్, పాలస్తీనా, యూఏఈ దేశాల్లో ఉన్న ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలు స్పష్టం చేశాయి.
Indian embassy in Saudi Arabia (@IndianEmbRiyadh) issues advisory. pic.twitter.com/Xpw9FXxOvT
— Press Trust of India (@PTI_News) February 28, 2026