AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. తాత తమతోనే ఉండాలని ఇంటినే ఎత్తుకెళ్లారు.. వీళ్ల ఆత్మీయతకు సలామ్‌ కొట్టాల్సిందే..

తన కొడుకు, మనవళ్లతో సన్నిహితంగా ఉండాలనుకునే ఓ వృద్ధుడికి సహాయం చేసేందుకు అక్కడి స్థానికులంతా కలిసి ఈ గొప్ప ప్రయత్నం చేశారు. స్థానికులు ఈ ఇంటిని మోయడానికి దాదాపు రెండు గంటలు పట్టింది.

వారెవ్వా.. తాత తమతోనే ఉండాలని ఇంటినే ఎత్తుకెళ్లారు.. వీళ్ల ఆత్మీయతకు సలామ్‌ కొట్టాల్సిందే..
Carry Elderly Mans House
Jyothi Gadda
|

Updated on: Dec 02, 2022 | 1:38 PM

Share

సోషల్ మీడియాలో కొన్ని అద్భుతమైన వీడియోలు చూస్తుంటాం. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ వీడియోలు కొన్ని న‌వ్వులు పూయిస్తే, మ‌రికొన్ని ఆలోచ‌నలు రేకెత్తించేలా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ప్రజల హృద‌యాల్ని గెలుచుకుంటాయి. ఫిలిప్పీన్స్‌లో స్ధానికులు కొంద‌రు ఓ వృద్ధుడి ఇంటిని భుజాల‌పైకెత్తుకుని ఆయ‌న ఆత్మీయుల చెంత‌కు చేర్చిన వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. వృద్ధుడు త‌న పిల్ల‌లు, మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌తో గ‌డిపేలా ఆయ‌న ఇంటిని స్ధానికులు త‌మ భుజాల‌పైకి ఎత్తుకుని కుటుంబాన్ని ఒక‌చోట చేర్చేందుకు చేసిన ప్ర‌య‌త్నం అంద‌రి హృద‌యాల‌ను తాకుతోంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ అనే పేజీ ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. చిన్న క్లిప్‌లో, ఫిలిప్పీన్స్‌లోని జాంబోంగా డెల్ నార్టే కమ్యూనిటీకి చెందిన సుమారు 24 మంది వ్యక్తులు 7 అడుగుల ఎత్తైన ఇంటిని మురికి రహదారి వెంట మోసుకుని వెళ్తున్నారు. తన కొడుకు, మనవళ్లతో సన్నిహితంగా ఉండాలనుకునే ఓ వృద్ధుడికి సహాయం చేసేందుకు అక్కడి స్థానికులంతా కలిసి ఈ గొప్ప ప్రయత్నం చేశారు. స్థానికులు ఈ ఇంటిని మోయడానికి దాదాపు రెండు గంటలు పట్టింది. మిషన్ విజయవంతమవడంతో స్థానికులంతా వారిపై హర్షధ్వానాలతో ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ఇప్పటివ‌ర‌కూ 20 ల‌క్ష‌ల‌కు పైగా ప్రజలు వీక్షించారు. వైరల్‌ వీడియో చూసిన నెటిజన్లు సైతం పొగడ్తలు, ప్రశంసలతో కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి