Viral: అడవిలో కనిపించిన పురాతన పెట్టె.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్..
చెక్ రిపబ్లిక్‌లోని క్రోనోస్ పర్వతాల్లో ఇద్దరు హైకర్లు అడవిలోని ఒక ప్రాంతంలో అల్యూమినియం పెట్టెను కనుగొన్నారు. ఆ బాక్స్‌లో బంగారు నాణేలు, ఆభరణాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి. అందులోని సంపద విలువ ఎంత ఉంటుంది లాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం పదండి..

చెక్ రిపబ్లిక్‌లోని క్రోనోస్ పర్వతాల్లో ఇద్దరు హైకర్లు అడవిలో ఒక రహస్య అల్యూమినియం బాక్స్ కనుగొన్నారు. ఆ బాక్స్ ఓపెన్ చేయగా వారి కళ్లు చెదిరిపోయాయి. ఎందుకంటే అందులో బంగారు నాణేలు, ఆభరణాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి. అందులో 598 బంగారు నాణేలు ఉన్నట్లు తేలింది. ఇవికాక 10 బంగారపు రోల్స్, 17 సిగార్ కేసులు, ఒక చిన్న పౌడర్ కేస్, జుట్టు సవరించుకునే కుంచె ఉన్నాయి. అయితే ఈ సంపదను ఆ హైకర్స్ గుట్టుచప్పుడు కాకుండా దాచుకోకుండా.. హ్రాదెక్ క్రాలోవేలోని ఈస్టర్న్ బొహేమియా మ్యూజియానికి అప్పగించారు.
నాణేలను పరీశిలించగా 1921 సంవత్సరం నాటివని తెలిసింది. సుమారు 100 సంవత్సరాలపాటు ఈ నిధి దాచబడి ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇది ప్రధానంగా యుద్ధం ముందు విపత్కర పరిస్థితుల్లో లేదా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి ముందు లేదా 1945లో జర్మన్లు ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయే ముందు దాచినట్లుగా పలు అంచనాలు వేస్తున్నారు.
నిధి కనుగొన్న వారు ముందుగా నాణేల నిపుణుడికి వివరాలు ఇచ్చారు. ఆ తర్వాతే పురావస్తు శాస్త్రజ్ఞులు అక్కడికి వెళ్లి పరిశీలన చేపట్టారు అని మ్యూజియం పురావస్తు విభాగ అధికారి మిరోస్లావ్ నోవాక్ చెప్పారు, ఖజానాను ఎవరు ఎందుకు దాచారనే విషయం ఇప్పటికీ రహస్యమే అని దానిని కనుగొనడం అన్నది ఆయన మాటల వెర్షన్. ఆ బంగారు నాణేలు ఎక్కువ భాగం బాల్కన్, ఫ్రెంచ్ దేశాలనుంచి చెందినవిగా చెబుతున్నారు. వాటిల్లో స్థానిక (చెక్) లేదా జర్మన్ నాణేల్లేవు అని అధికారులు వివరించారు. దొరికిన నిధి విలువ భారత కరెన్సీలో దాదాపు 3 కోట్ల రూపాయల పైగా ఉంటుందని అంచనా.
కొంతమంది ప్రజలు దీనిని ఒక ధనవంత కుటుంబానికి చెందని ఆస్తిగా భావిస్తుంటే, మరికొందరు దీనిని యుద్ధ కాలంలో సైనికుల దోపిడీ చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ రహస్య బాక్స్ ప్రాథమికంగా చెక్-పోలండ్ సరిహద్దు ప్రాంతంలో దొరికింది. ప్రస్తుతం ఈ స్థలంలో మరింత పరిశోధన చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
