AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులతో సహా 8 మృతి

ఘనాలోని అటవీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం 8 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మంత్రులు సహా 8 మంది మృతి చెందారు. ఘనా దేశానికి చెందిన రక్షణ శాఖ, పర్యావరణ శాఖ మంత్రులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు.

ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులతో సహా 8 మృతి
Helicopter Crashes In Ghana
Balaraju Goud
|

Updated on: Aug 07, 2025 | 7:59 AM

Share

ఘనాలోని అటవీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం 8 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మంత్రులు సహా 8 మంది మృతి చెందారు. ఘనా దేశానికి చెందిన రక్షణ శాఖ, పర్యావరణ శాఖ మంత్రులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదం ఘనాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు మంత్రులు మృతి చెందడంతో అక్కడి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

ఘనాలో సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఘనా రక్షణ, పర్యావరణ మంత్రులు సహా ఎనిమిది మంది మరణించారు. బుధవారం(ఆగస్టు 6) రాజధాని అక్ర నుండి హెలికాప్టర్ బయలుదేరింది. సమస్యాత్మక వాయువ్య ప్రాంతమైన ఒబువాసికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఘనా సైన్యం తెలిపింది. గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే.. అది అకస్మాత్తుగా రాడార్ నుండి అదృశ్యమైంది. తరువాత, దాని శిథిలాలు అడాన్సి ప్రాంతంలో కనుగొన్నట్లు సైన్యం వెల్లడించింది. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని సైన్యం తెలిపింది.

రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా మొహమ్మద్, పాలక నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, జాతీయ భద్రతా సలహాదారు తోపాటు పలువురు సిబ్బంది కూడా మరణించారు. బోమా నివాసంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయానికి సంతాప సందేశాలు వచ్చాయి. ఘనా ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా అభివర్ణించింది.

బుర్కినా ఫాసోలోని ఉత్తర సరిహద్దులో జిహాదీ కార్యకలాపాలు పెరుగుతున్న సమయంలో బోమా ఘనా రక్షణ మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహిస్తున్నాడు. పొరుగున ఉన్న టోగో, బెనిన్ ల మాదిరిగా కాకుండా, ఘనా ఇప్పటివరకు సహెల్ నుండి జిహాదీల చొరబాట్లను నిరోధిస్తోంది. ఆయుధాల అక్రమ రవాణా పెరుగుతుందని, బుర్కినా ఫాసో నుండి ఉగ్రవాదులు పోరస్ సరిహద్దును దాటి ఘనాను వెనుక స్థావరంగా ఉపయోగించుకుంటారని హెచ్చరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..