AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రైతుల కంటే ముఖ్యమైనది ఏదీ లేదు.. భారత్‌ ఎప్పుడూ రాజీపడబోదు’: మోదీ

మన రైతుల ప్రయోజనాలే మా ప్రథమ ప్రాధాన్యత అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారతదేశం తన రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలపై ఎప్పుడూ రాజీపడదని ప్రధాని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఐసిఎఆర్ పుసాలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

'రైతుల కంటే ముఖ్యమైనది ఏదీ లేదు.. భారత్‌ ఎప్పుడూ రాజీపడబోదు': మోదీ
Pm Modi On Farmers
Balaraju Goud
|

Updated on: Aug 07, 2025 | 11:15 AM

Share

అమెరికా సుంకాల సంక్షోభం మధ్య, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలక ప్రకటన చేశారు. మన రైతుల ప్రయోజనాలే మా ప్రధాన ప్రాధాన్యత అని ప్రధాని అన్నారు. భారతదేశం తన రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్య కార సోదర సోదరీమణుల ప్రయోజనాల కోసం భారత్ ఎప్పుడూ రాజీపడదని ప్రధాని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలుసు, కానీ దానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఢిల్లీలోని ఐసిఎఆర్ పుసాలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ రైతులు, మత్స్యకారులు, పాడిరైతుల కోసం.. భారత్‌ ప్రభుత్వం నిలబడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయంపై ఖర్చు తగ్గించడం, కొత్త ఆదాయ వనరులను సృష్టించడం అనే లక్ష్యాల కోసం మేము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రైతుల బలాన్ని దేశ పురోగతికి ఆధారంగా పని చేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఇటీవల ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజనకు కూడా ఆమోదం లభించిందని మోదీ తెలిపారు. దీని కింద వ్యవసాయం వెనుకబడిన 100 జిల్లాలను ఎంపిక చేశామని చెప్పారు. ఇక్కడ సౌకర్యాలు కల్పించడం ద్వారా, రైతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా, వ్యవసాయంలో కొత్త విశ్వాసం ఏర్పడుతోంది. 10 వేల ఎఫ్‌పిఓల ఏర్పాటు చిన్న రైతుల వ్యవస్థీకృత శక్తిని పెంచిందని ఆయన అన్నారు. సహకార, స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిచ్చిందని ఆయన అన్నారు. దీంతో పాటు, ఇ-నామ్ కారణంగా, రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడం సులభతరం అయిందని ప్రధాని మోదీ అన్నారు.

రైతుల విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలు

గత సంవత్సరాల్లో రూపొందించిన విధానాల ద్వారా, మేము రైతులకు సహాయం చేయడమే కాకుండా వారిలో విశ్వాసాన్ని పెంచడానికి కూడా ప్రయత్నించామని మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుండి అందుకున్న ప్రత్యక్ష సహాయం చిన్న రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి పంట బీమా పథకం రైతులకు నష్టాల నుండి రక్షణ కల్పించింది. ప్రధానమంత్రి వ్యవసాయ నీటిపారుదల పథకం ద్వారా నీటిపారుదల సంబంధిత సమస్యలను పరిష్కరించారని ప్రధాని మోదీ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..