Gold Mine Collapse: నైజీరియాలోని దక్షిణ నైజర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. గోల్డ్ మైన్ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదు సంఖ్యలతో తీవ్రంగా గాయపడగా.. చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. నైజీరియా సరిహద్దుల్లోని దక్షిణ నైజర్‌లో ఆర్టిసానల్ గోల్డ్ మైన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదాన్ని డాన్ ఇస్సా జిల్లా మేయర్ అడమౌ గురౌ ధృవీరించారు. ప్రస్తుతానికి 18 మంది చనిపోయారని, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అనేక మంది పౌరులు గాపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గ్యారిన్-లిమాన్ గని స్థలంలో ఆర్టిసానల్ బావులు కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల్లో ఇంకా మృతదేహాలు చిక్కుకుని ఉండవచ్చునని అన్నారు.
కాగా, ఈ గ్యారిన్-లిమాన్ గనులను కొన్ని నెలల క్రితమే కొనుగొన్నారు. అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే, అక్కడి నేల అస్థిరత కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని చెబుతున్నారు. మైనింగ్‌లో పాత పద్ధతులు పాటించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణం అని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ సెక్టార్‌ను ఆధునీకరించే ప్రయత్నాల్లో బాగంగా అక్కడి ప్రభుత్వం 2017లోనే అనేక ఆర్టిసావల్ గోల్డ్‌మైన్‌లను మూసివేసింది.
Breaking news: Reports that at least 20 people have died in a goldmine incident in Niger, leaving dozens of them trapped pic.twitter.com/MNZf4MLbSp
— Mawunya (@Mawunya_) November 8, 2021
Also read:
PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బుల కోసం ఇలా మీ పేరు చెక్ చేసుకోండి..
Crime News: ఓ భర్త కిరాతకం.. టవల్ ఆలస్యంగా ఇచ్చిందని భార్యను చంపేశాడు.. ఎక్కడ జరిగిందంటే..