AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rekha Sharma: చైతన్యంతోనే ఎన్ఆర్ఐ మోసాలకు చెక్: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ

Rekha Sharma: ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఢిల్లీ అనంతరం దక్షణాది రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో ఎంఆర్ఐ వివాహ సంబంధిత మోసాల కేసులు అధికంగా..

Rekha Sharma: చైతన్యంతోనే ఎన్ఆర్ఐ మోసాలకు చెక్: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ
Subhash Goud
|

Updated on: Dec 17, 2021 | 7:17 PM

Share

Rekha Sharma: ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఢిల్లీ అనంతరం దక్షణాది రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో ఎంఆర్ఐ వివాహ సంబంధిత మోసాల కేసులు అధికంగా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుల వివాహాలకు సంబంధించిన మోసాలపై మహిళలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, సమస్యలు, తదితర అంశాలపై న్యాయ సంబంధిత చట్టాలపై అవగాహనపై బేగంపేట టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన సదస్సుకు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జాతీయ మహిళా కమీషన్, తెలంగాణా పోలీస్ మహిళా భద్రతా విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రెటరీ ఎం.వి రమేష్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి బాలయ్య లు హాజరయ్యారు.

డాక్టర్‌ ఐజి సుమతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రేఖా శర్మ మాట్లాడుతూ.. జాతీయ మహిళా కమిషన్ వద్ద ఎంఆర్ఐ వివాహాలకు సంబంధించి 5,858 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి వివిధ దేశాలకు చెందిన పలు ఏజెన్సీలు, మన దేశంలోని వివిధ సంస్థల సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నందున, పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ విధమైన గృహ సంబంధిత నేరాలకు అదుపుకు, మహిళలు ప్రధానంగా వివాహానికి సిద్ధంగా ఉన్న యువతులను చైతన్య పరచడమే మార్గమని రేఖాశర్మ అభిప్రాయం పడ్డారు.

ముఖ్యంగా మహిళా కళాశాలల్లో ఎన్ఆర్ఐ వివాహాలకు సంబంధించిన చట్టాలు, జాగ్రత్తలు, జరిగే మోసాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను పోల్చి చూస్తే తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని అభినందించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్షారెడ్డి మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐ వివాహ మోసాలకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్‌కు 15 ఫిర్యాదులు అందాయని తెలిపారు. పోలీస్ శాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం, లీగల్ సర్వీసెస్ అథారిటీ తదితర సంస్థల సమన్వయంతో మహిళల సమస్యలపై అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.

రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు 728 ఎన్ఆర్ఐ వివాహాలకు సంబంధించిన కేసులు దాఖలయ్యాయని వెల్లడించారు. వీటిలో 678 కేసులు గ్రామీణ పోలీస్ స్టేషన్లలో నమోదయినవే ఉన్నాయని తెలిపారు. మహిళా భద్రతా విభాగంలో 2019 నుండి 239 కేసులు నమోదు కాగా 42 కేసులను పరిష్కరించామని, మిగిలినవి వివిధ స్థాయిల్లో ఉన్నాయని వివరించారు. ఎన్ఆర్ఐ వివాహా మోసాలకు సంబంధించిన ప్రతీ కేసు భిన్నంగా ఉంటున్నందున వీటి పరిష్కారానికై బాధితులు ఎంతో ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ప్రధానంగా అమెరికా,ఆస్ట్రేలియా, బ్రిటన్, సౌదీ అరేబియా, కెనడా దేశాలకు సంబంధించిన కేసులే అధికంగా ఉన్నాయని వివరించారు. ఏఆర్ఐ వివాహాలకు సంబంధించిన కేసు నమోదయితే ఆయా కేసుకు ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించి, వివిధ ఏజెన్సీలు, విదేశీ ఎంబసీలతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు చేపట్టామని అడిషనల్ డీజీ వివరించారు. డిఐజి సుమతి మాట్లాడుతూ.. మహిళలకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికై ప్రత్యేకంగా 18 మహిళా పోలీస్ స్టేషన్లు పని చేస్తున్నాయని తెలిపారు. మహిళలకు సంబంధించి ప్రవాస భారతీయుల మోసాలపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి పోలీస్ శాఖ తోపాటు జాతీయ మహిళా కమిషన్, భారత విదేశీ మంత్రిత్వ శాఖ, హోమ్ మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో పని చేస్తున్నామని తెలియ చేశారు.

ఈ సందర్బంగా తెలంగాణాలో ఎన్ఆర్ఐ సెల్ విభాగం పని తీరు అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆవిష్కరించారు. ఈ సదస్సులో హైదరాబాద్ లోని వివిధ దేశాలకు సంబందించిన కన్సొలేట్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

Global Indians: మీకు తెలుసా? మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెట్టే బ్రెస్ట్ క్యాన్సర్‌కు వ్యాక్సిన్ సిద్ధం చేస్తోంది మన దేశ వనితే!

Neena Gupta: గణిత చిక్కు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి.. ‘రామానుజన్ ప్రైజ్ 2021’ విజేత నీనా గుప్తా వ్యాఖ్యలు

Follow Us