Global Politicians: విదేశాల్లో సత్తా చాటుతున్న భారతీయులు.. 6 దేశాల్లో కీలక బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు

|

Oct 25, 2022 | 9:16 AM

విదేశాల్లోకి జీవనోపాధి కోసం లేదా విధుల నిర్వహణ కోసం వెళ్లిన భారతీయులు అక్కడ ఆ దేశాల్లో సెటిల్ అయ్యి.. ఆ దేశంలోనే ప్రముఖ వ్యక్తులుగా ఎదిగినవారు ఎందరో ఉన్నారు. వ్యాపార, క్రీడా, వ్యవసాయం వంటి అనేక రంగాలతో పాటు.. రాజకీయంగా కూడా తమ సత్తాను చాటుతున్న భారతీయ సంతతికి చెందినవారు ఎందరో ఉన్నారు.

Global Politicians: విదేశాల్లో సత్తా చాటుతున్న భారతీయులు.. 6 దేశాల్లో కీలక బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు
Indian Origin President In
Follow us on

ప్రపంచ పాఠంలోని ఏ దేశంలో చూసినా ఎక్కడోచోట భారతీయులు.. భారతీయుల మూలాలు ఉన్న వ్యక్తులు కనిపిస్తారని అంటారు. కష్టపడే తత్వం, వివాదాలకు దూరంగా … విశ్వాసం, పదుగురిని కలుపుకుని వెళ్లే నేచర్ తో ఎక్కడ ఎలాంటి పరిస్థితులున్నా జీవిస్తారని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇలా విదేశాల్లోకి జీవనోపాధి కోసం లేదా విధుల నిర్వహణ కోసం వెళ్లిన భారతీయులు అక్కడ ఆ దేశాల్లో సెటిల్ అయ్యి.. ఆ దేశంలోనే ప్రముఖ వ్యక్తులుగా ఎదిగినవారు ఎందరో ఉన్నారు. వ్యాపార, క్రీడా, వ్యవసాయం వంటి అనేక రంగాలతో పాటు.. రాజకీయంగా కూడా తమ సత్తాను చాటుతున్న భారతీయ సంతతికి చెందినవారు ఎందరో ఉన్నారు. తాజాగా బ్రిటన్‌ ప్రధానిగా రిషిసునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వాల్డ్‌వైజ్‌ భారత్‌ కొత్త చరిత్ర సృష్టించింది. భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టే ఆరో దేశంగా బ్రిటన్‌ నిలిచింది. ఇప్పటికే 6 దేశాల్లో ప్రెసిడెంట్‌, వైస్‌ప్రెసిడెంట్‌, ప్రధాని హోదాలో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. మరి ఆ దేశాలు ఏవి..? వారెవ్వరు..? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బ్రిటన్‌ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ చరిత్ర సృష్టించారు. లిజ్‌ ట్రస్‌ రాజీనామాతో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధానిగా టోరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. తాజా పరిణామంతో భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టే ఆరో దేశంగా బ్రిటన్‌ నిలిచింది. ఇప్పటికే ఆరు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ కొత్త ప్రెసిడెంట్‌గా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ సిటీలో జన్మించిన రిషి పూర్వీకుల మూలాలు భారత్‌లోని పంజాబ్‌లో ఉన్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు. బోరిస్‌ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసి మంచి గుర్తింపు పొందిన రిషి సునాక్‌.. తాజాగా ఆ దేశ అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్నారు.

గోవా మూలాలున్న ఆంటోనియో కోస్టా ప్రస్తుతం పోర్చుగల్‌ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో కోస్టా..గోవాకు చెందినవారు. ఇక ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌..2020లో గయానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. మారిషస్‌ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టిన ప్రవింద్‌ జుగ్నాథ్‌ భారత మూలాలున్న హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా…మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ కుటుంబం కూడా భారత ఆర్యసమాజ్‌ హిందూ కుటుంబానికి చెందినదే. అనేకసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. 2019లో మారిషస్‌ అధ్యక్షుడు అయ్యారు.

ఇవి కూడా చదవండి

భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమె పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురానికి చెందినవారు. కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వారు. సౌత్‌ అమెరికాలోని సురినామ్‌ దేశాధ్యక్షుడిగా చంద్రికా ప్రసాద్‌ సంతోఖి కొనసాగుతున్నారు. 1959లో జన్మించిన చంద్రిక ప్రసాద్‌ కుటుంబం భారత మూలాలున్నవారే..

మొత్తానికి భారత మూలాలున్న వ్యక్తులు విదేశీ గడ్డపై రాజకీయాల్లో కీలక పదవులు చేపడుతూ తమ సత్తా చాటుతున్నారు. కేవలం ఈ ఆరు దేశాలే కాకుండా ట్రినిడాడ్‌ & టొబాగో, పోర్చుగల్‌, మలేసియా, ఫిజీ, ఐర్లాండ్‌ వంటి దేశాల్లో భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో తమ విధులను కొనసాగిస్తూ.. ఆ దేశానికి వన్నె తెస్తున్నారు.

మరిన్ని గ్లోబల్ ఇండియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..