ATA Celebrations 2022: ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత.. జూలై 2న బతుకమ్మ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

జూలై 2 న ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు.

ATA Celebrations 2022: ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత.. జూలై 2న బతుకమ్మ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
Ata Celebs Mlc Kavitha

Edited By:

Updated on: Jul 04, 2022 | 11:07 AM

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు జరగనున్నాయి  ఆటా మహాసభలు. యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2 న ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటా ప్రైమ్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత అతిధిగా హాజరుకానున్నారు. ఈ సభలో కవిత ప్రసంగించనున్నారు.

అనంతరం ఇదే సమావేశంలో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాదిగా వలంటీర్లు వివిధ ఏర్పాట్ల కోసం 80 కమిటీలుగా ఏర్పడి ఇందుకోసం శ్రమిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని గ్లోబల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us