NRI News: విహారయాత్రలో విషాదం.. అమెరికాలో ఏపీ మహిళ మృతి..
ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కేనవారిపాలెం (Makkenavaripalem Village) గ్రామానికి చెందిన సుప్రజ అక్కడికక్కడే మరణించింది.
NRI News: విహారయాత్ర ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఏపీకి చెందిన ఓ మహిళ అమెరికాలో మరణించింది. అమెరికాలోని ఫ్లోరిడా (Florida US State) లో ప్యారాచూట్ ఫ్లయింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కేనవారిపాలెం (Makkenavaripalem Village) గ్రామానికి చెందిన సుప్రజ అక్కడికక్కడే మరణించింది. సుప్రజ కుమారుడు అఖిల్ స్వల్ప గాయాలయ్యాయి.
భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున మూడున్నర గంటలకు ప్యారాచూట్ (Parachute Flying ) కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనతో బాపట్ల జిల్లా మక్కేనవారిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా.. కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని ఏపీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
అక్కడే ఉంటున్న సుప్రజ కుటుంబం మంగళవారం విహారయాత్రకు వెళ్లినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని గ్లోబల్ ఇండియన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..