యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః! అంటే ఎక్కడ స్త్రీలు పూజింప బడతరో, అక్కడ దేవతలు కొలువై ఉంటారని సమాజంలో స్త్రీ కి ఉన్న ప్రాధాన్యతను చెప్పారు. అందుకే స్త్రీ సర్వత్రా పూజ్యనీయురాలు. సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా స్త్రీలు తాము పురుషుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కామంటూ ఆకాశంలో సగం.. అవని లో సగం అంటూ అన్నింటా తమని తాము నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా తానా మహాసభలను నిర్వహించాడనికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో మహిళలకు పెద్ద పీఠను వేశారు నిర్వాహకులు. ఈ సభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు.
మరోవైపు ఈ మహాసభల్లో మహిళలకు పెద్ద పీఠ వేసి పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జూలై 8వ తేదీన ఉమెన్ ఎంపవర్‌మెంట్ – మెడికల్ (నారీశక్తి) పేరున ఈ కార్యక్రమంలో నిర్వహిచనున్నారు. ఈ కార్యక్రమంలో పలురంగాలకు చెందిన మహిళా ప్రముఖులు పాల్గొని మాట్లాడనున్నారు. శిరీష బండ్ల (అంతరిక్ష వ్యోమగామి), సత్యవాణి (భారతీయం), నందమూరి వసుంధర, సింగర్ చిత్ర, సుమ కనకాల, శ్రీలీల, లయ, అనసూయ సహా పలువురు మహిళలు అతిధులుగా పాల్గొననున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..