G20 Summit: ప్రారంభమైన జీ20 సమ్మిట్‌.. సభావేదికపై ఆసక్తికర సన్నివేశం.. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవ్వుల పువ్వులు..

|

Nov 15, 2022 | 11:03 AM

ఇండోనేషియాలోని బాలిలో G20 సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సమావేశానికి మనదేశ ప్రధాన నరేంద్ర మోదీ హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమం ప్రారంభమవడానికి ముందు సభపై..

G20 Summit: ప్రారంభమైన జీ20 సమ్మిట్‌.. సభావేదికపై ఆసక్తికర సన్నివేశం.. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవ్వుల పువ్వులు..
Pm Modi Joe Biden
Follow us on

ఇండోనేషియాలోని బాలిలో G20 సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సమావేశానికి మనదేశ ప్రధాన నరేంద్ర మోదీ హాజరయ్యారు.  ఈ కార్యక్రమం ప్రారంభమవడానికి ముందు సభపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) విడుదల చేసింది. ఈ వీడియోలో ప్రధాని మోదీ ఏదో చెబుతుండగా, జో బైడెన్ సరదాగా నవ్వుకున్నారు. ఆ తరువాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మక్రాన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

కాగా, రెండు రోజుల G20 సమ్మిట్.. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రసంగంతో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధానంశంగా ప్రస్తావిస్తూ ఇండోనేషియా అధ్యక్షుడు ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ‘‘బాధ్యతగా ఉంటే యుద్ధాన్ని ముగించాలి’’ అని వ్యాఖ్యానించారు. యుద్ధం ముగియకపోతే ప్రపంచం ముందుకు సాగడం కష్టమని పేర్కొన్నారు. ‘‘ప్రపంచం మరో ప్రచ్ఛన్న యుద్ధంలోకి జారిపోకూడదు.’’ అని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సమ్మిట్‌లో కోవిడ్-19, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా-ఉక్రెయన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత, ఆహార భద్రత సవాళ్లు, ద్రవ్యోల్బనం, ఆర్థిక మాంద్యం వంటి అంశాలపై జీ20 దేశాలు చర్చించనున్నాయి. ముఖ్యమైన ప్రపంచ సవాళ్లను అధిగమించే మార్గాలపై సమ్మిట్ విస్తృతమైన చర్చలు జరుపనుంది. ప్రపంచ వ్యాప్తంగా స్థిరాభివృద్ధికి ఈ సమ్మిట్ మార్గం చూపుతుందని యావత్ ప్రపంచం భావిస్తుంది.

ఇవి కూడా చదవండి

కాగా, సోమవారం నాడు సాయంత్రం ఇండోనేషియాకు చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 నిర్వహణ బాధ్యతలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. వచ్చే ఏడాది జీ20 సమ్మిట్ ఇండియాలోని కశ్మీర్‌లో జరగనుంది. ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ప్రధాని మోదీ లాంఛనప్రాయంగా..జీ 20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ బాలీలో సదస్సు ముగింపు వేళ జరగనుంది.. ఈ గౌరవంతో ప్రపంచ దేశాల నడుమ భారత్‌ పరపతి మరింత పెరగనుంది..ఇది భారతీయులకు ఎంతో గర్వకారణం. అయితే, ఇండియా G20 అధ్యక్ష పదవికి సంబంధించిన లోగో, థీమ్‌, వెబ్‌సైట్‌ను గతవారం వర్చువల్ బ్రీఫింగ్ సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఇకపోతే, రెండు రోజుల జి 20 శిఖరాగ్ర సదస్సు మంగళవారం ఉదయం ప్రారంభమవగా.. ఈ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ తో సహా 20 దేశాల, యూరోపియన్ యూనియన్‌లకు చెందిన అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. జీ 20 సదస్సులో పాల్గొనడంతో పాటు కీలక నేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు.

బైడెన్‌తో ప్రధాని మోదీ సరదా సంభాషణను కింది వీడియోలో చూడొచ్చు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..