AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Layoff: ఉద్యోగులను తొలగించబోతున్న మరో దిగ్గజ కంపెనీ..? తెలుసుకుందాం…

ఈకామర్స్ రంగంలో కానీ, ఓటీటీ రంగంలో కానీ అమెజాన్ పేరు మారుమోగుతూనే ఉంటుంది. అయితే సోమవారం నుంచి ఈ దిగ్గజ కంపెనీకి సంబంధించిన వార్త ఒకటి బాగా ట్రెండ్ అవుతోంది. అది ఏమిటంటే..

Amazon Layoff: ఉద్యోగులను తొలగించబోతున్న మరో దిగ్గజ కంపెనీ..? తెలుసుకుందాం...
Amazon
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 15, 2022 | 11:37 AM

Share

ప్రతి రోజు ఏదో రకంగా వార్తలలో వినిపించే పేరు అమెజాన్. అమెజాన్ కంపెనీ గురించి తెలియనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ-కామర్స్ రంగంలో కానీ, ఓటీటీ రంగంలో కానీ దీని పేరు మారుమోగుతూనే ఉంటుంది. అయితే సోమవారం నుంచి ఈ దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీకి సంబంధించిన వార్త ఒకటి బాగా ట్రెండ్ అవుతోంది. అది ఏమిటంటే.. ఈ వారం మునిసేసరికకి 10 వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి అమెజాన్ తొలగించనున్నట్లు దాని సారంశం. ‘‘ ఉద్యోగులను తొలగించడం అనేది కంపెనీ యూనిట్ల మీద ప్రభావం చూపిస్తుంది. రిటైల్ డివిజన్, మానవ వనరులు వంటి అంశాల మీద కూడా ఇది తన దృష్టి సారిస్తుంది. అందిన సమాచారం ప్రకారం ఎంత మందిని తొలగిస్తారనేది అధికారుల నిర్ణయంపైనే అధారపడి ఉంది’’ అని పలు వార్తాకథనాలు వెలువడుతున్నాయి. కాగా, అమెజాన్ కంపెనీ ఇటీవలే అమెరికాలలోని బాండ్వెగన్‌లో చేరింది.

రాబోయే ఆర్థిక మాంద్యం కోసం ఉద్యోగులకు కోత కోయడం దీని పని. 2021 డిసెంబర్ 31 నాటికి అమెజాన్‌లో మొత్తం 1608 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తన ఉద్యోగులను తొలగించకుండా ఉండేందుకు ఆ కంపెనీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే కంపెనీ నుంచి దాదాపు 3 శాతం మంది లేదా 10 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సోమవారం అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక న్యూ యార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘‘ మారుతున్న వ్యాపార రూపాలు, అర్థిక వ్యవస్థలోని అవకతవకల నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ఉద్యోగులను తొలగించనుంది. ట్విట్టర్‌ను తన వశం చేసుకున్న ఎలాన్ మస్క్ కూడా సగం మంది ఉద్యోగులను తొలగించాడు.

ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా కూడా దాదాపు 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. లిఫ్ట్, స్ట్రిప్, స్నాప్ వంటి అనేక ఇతర సాంకేతిక సంస్థలు కూడా ఇటీవల కాలంలో తమ ఉద్యోగులను తొలగించాయి’’ అని న్యూ యార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఇక అమెజాన్ కంపెనీ ప్రస్తుత త్రైమాసికంలో స్వల్పంగా పుంజుకుంది. కానీ వృద్ధి రేటు మాత్రం బలహీనపడవచ్చని తన పెట్టుబడిదారులను స్వయంగా హెచ్చరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్