Covid-19 New Variant ‘IHU’: ఫ్రాన్స్‌లో మరో వేరియంట్ వెలుగులోకి… ఇప్పటికే 12 మందికి సోకినట్లు నిర్ధారణ..

|

Jan 04, 2022 | 3:32 PM

Covid-19 New Variant 'IHU': ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరో వైపు యూరోపియన్ కంట్రీ ఫ్రాన్స్ లో సరికొత్త వేరియంట్ వెలుగులోకి..

Covid-19 New Variant IHU: ఫ్రాన్స్‌లో మరో వేరియంట్ వెలుగులోకి... ఇప్పటికే 12 మందికి సోకినట్లు నిర్ధారణ..
New Covid 19 Variant Ihu Di
Follow us on

Covid-19 New Variant ‘IHU’: ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరో వైపు యూరోపియన్ కంట్రీ ఫ్రాన్స్ లో సరికొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త కోవిడ్‌ వేరియంట్‌ రకాన్ని ఫ్రెంచ్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఇది కామెరూనియన్ మూలానికి చెందినదిగా శాస్త్రజ్ఞులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ కు తాత్కాలికంగా ‘ IHU ‘ అని పేరు పెట్టారు. ఇది కరోనా B.1.640.2గా శాస్త్రవేత్తలు నిర్దారించారు.

అంతేకాదు ఫ్రాన్స్ లో ఈ వేరియంట్‌ బారిన 12 మంది పడినట్లు చెప్పారు. ఈ కొత్త వేరియంట్‌ IHUలో 46 కొత్త మ్యుటేషన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సరికొత్త వేరియంట్  మొదట డిసెంబర్ 10న వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే WHO ఇప్పటికీ దీనిని పరిశోధనలో ఉన్న వేరియంట్‌గా గుర్తించలేదు. ఈ IHU వేరియంట్  ముప్పు ఒమిక్రాన్ కంటే అధికమని.. వేగం వ్యాపిస్తుందని పరిశోధకులు తగిన జాగ్రత్తలు తీసుకువాలంటూ ప్రభుత్వాలను, ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Also Read:

షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లపై కోవిడ్ ఆంక్షలు.. ఎన్నికల ర్యాలీలు మాత్రం భేషుగ్గా జరుపుకోవచ్చు!

 గోవాలో కరోనాకు స్వాగతం పలుకుతున్న పర్యాటకులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

అమెరికాలో కరోనా థర్డ్ వేవ్ విలయతాండవం.. గత 24 గంటల్లో 1 మిలియన్ కంటే ఎక్కువ కేసులు..