MPOX Variant: మానవాళిని వదలని వైరస్‌లు.. లండన్‌లో మంకీఫాక్స్ సరికొత్త వేరియంట్.. నలుగురు బాధితులు గుర్తింపు

|

Nov 08, 2024 | 9:44 AM

కరోనా మహమ్మారి ప్రపంచానికి దాదాపు రెండేళ్లపాటు గజగజా వణికించింది. ఆ పీడకల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను రకరకాల వైరస్ లు వెలుగులోకి వస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. వీటిల్లో కొన్ని వైరస్ లు గత కొన్నేళ్ళ క్రితం నుంచి ఉన్నవే.. అవి కొత్త రూపం దాల్చి మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మంకీపాక్స్ (mpox ) కొత్త వేరియంట్ ఆఫ్రికా వెలుపల నమోదు అయింది.

MPOX Variant: మానవాళిని వదలని వైరస్‌లు.. లండన్‌లో మంకీఫాక్స్ సరికొత్త వేరియంట్.. నలుగురు బాధితులు గుర్తింపు
Mpox New Cases In Uk
Follow us on

ఆఫ్రికా దేశాలను చుట్టేసిన ప్రమాదకర మంకీపాక్స్‌ వైరస్‌ ఇప్పుడు సరికొత్త రూపాన్ని సంతరించుకుని ఇతర దేశాల్లో వెలుగులోకి వస్తూ ఆందోళన రేకెత్తిస్తోంది. కాంగోలో మొట్టమొదట సారి వెలుగులోకి వచ్చిన mpox కొత్త వేరియంట్ కు సంబంధించిన నాలుగు కేసులను గుర్తించినట్లు బ్రిటీష్ ఆరోగ్య అధికారులు చెప్పారు. ఈ వేరియంట్ ఆఫ్రికా వెలుపల అనారోగ్య సమస్యలకు కారణమైంది. అయితే ఈ సరికొత్త వేరియంట్ వలన ప్రమాదం తక్కువగానే ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గత వారం UK లో మంకీపాక్స్‌( mpox ) కొత్త వేరియంట్ కు సంబంధించిన మొదటి కేసును గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఈ వేరియంట్ బాధితులు రోజు రోజుకీ పెరుగుతున్నుయి. ఈ వైరస్ వ్యాప్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం కేసు మంకీపాక్స్‌ కొత్త వేరియంట్ కు సంబంధించిన బాధితులు లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ వారం UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అదే ఇంటిలో నివసించిన మరో మూడు కేసులను గుర్తించినట్లు తెలిపింది. వీరు కూడా ఇప్పుడు లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ బాధితులకు పరిచయం ఉన్న కుటుంబాలలో ఈ అంటువ్యాధి వ్యాపించే అవకాశం ఉందని.. మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ముఖ్య వైద్య సలహాదారు సుసాన్ హాప్కిన్స్ చెప్పారు.

మంకీపాక్స్‌ వైరస్‌ (mpox) కొత్త వేరియంట్ ఈ సంవత్సరం మొదట్లో తూర్పు కాంగోలో కనుగొనబడింది. ఈ వేరియంట్ లక్షణాలు చాలా తేలికగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఈ లక్షణాలను మొదట్లో గమనించడం కష్టం.. కనుక ఈ వేరియంట్ చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ఈ వైరస్ సోకినట్లు ప్రజలకు తెలియకపోవడమే అని అంటున్నారు. కాంగో తో పాటు ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో ఈ వేరియంట్ వ్యాప్తి పెరగడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టులో ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

100 కంటే ఎక్కువ దేశాలలో కేసులు నమోదయ్యాయి. 2022లో బ్రిటన్‌లో మరొక రకమైన mpox కేసులు 3,000 కంటే ఎక్కువ నమోదయ్యాయి. బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాలో కూడా వ్యాప్తి చెందింది అంతేకాదు స్వీడన్, భారత్, జర్మనీ, థాయ్‌లాండ్‌లకు చెందిన ప్రయాణికులకు ఈ వైరస్ సోకింది. ఈ రోజు వరకు ఆ ఫ్రికాలో దాదాపు 43,000 అనుమానిత మంకీ ఫాక్స్ కేసులు ఉన్నాయి. 1,000 కంటే ఎక్కువ మంది మరణించారు. mpox మహమ్మారితో పోరాడుతున్న తొమ్మిది ఆఫ్రికన్ దేశాలకు WHO బుధవారం 899,900 వ్యాక్సిన్లను కేటాయించినట్లు తెలిపింది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..