AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షిప్‌లో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు.. తిమింగలాలు తిరిగే సముద్ర జలాలు.. అసలు ఏమైందంటే.!!

సముద్రంలో షిప్ యాక్సిడెంట్ జరిగితే ఇక అంతే.! దెబ్బకు ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. 'టైటానిక్' సినిమాకు కూడా షిప్ యాక్సిడెంటే..

షిప్‌లో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు.. తిమింగలాలు తిరిగే సముద్ర జలాలు.. అసలు ఏమైందంటే.!!
Ravi Kiran
|

Updated on: Jun 02, 2021 | 6:22 PM

Share

సముద్రంలో షిప్ యాక్సిడెంట్ జరిగితే ఇక అంతే.! దెబ్బకు ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ‘టైటానిక్’ సినిమాకు కూడా షిప్ యాక్సిడెంటే మూలకథ. ఇక ఇప్పుడు టైటానిక్ సినిమా తరహాలోనే ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఇండోనేషియాలో ప్రయాణికులతో వెళ్తున్న భారీ నౌక మొలుక్కా సముద్రంలో మంటల్లో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు సముద్రంలోకి దూకేశారు. నార్త్ మలూకాలోని టెర్నేట్ ప్రావిన్స్ నుంచి ఈశాన్య ఇండోనేషియాలోని మారుమూల ద్వీపమైన సననకు వెళ్తున్న కేఎం కార్య ఇందా అనే ఈ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ప్రమాదం సమయంలో నౌకలో 22 మంది పిల్లలు, 14 మంది సిబ్బందితో సహా 181 మంది ఉన్నారు. ప్రమాదం చోటుచేసుకోగానే ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ నౌక కెప్టెన్ అగ్ని ప్రమాదాన్ని వెంటనే గుర్తించి అధికారులకు తెలియజేయడంతో వెంటనే సహాయం అందింది. లేకపోతే ప్రయాణికులంతా మంటలకు ఆహుతయ్యేవారు.

పైగా ఈ ప్రమాదం తిమింగలాలు ఎక్కువగా సంచరించే సముద్ర జలాల్లో చోటు చేసుకుంది. ప్రజలు సముద్రంలో దూకే సమయానికి తిమింగలాలేవీ అక్కడ లేకపోవడంతో అదృష్టమని అంటున్నారు. ఉదయం 7 గంటల సమయంలో టెర్నేట్ నగరం నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టిన 15 నిమిషాలకే ఓడలోని ఇంజిన్‌ గదిలో మంటలు వ్యాపించాయని తెలుస్తోంది.

Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్