శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడిగిస్తూ నిర్ణయం

శ్రీలంకలో జరిగిన ఆత్మాహుతి దాడి నేపధ్యంలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన విధించిన ఎమర్జెన్సీని కొనసాగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెలలో ఈస్టర్ వేడుకల సందర్భంగా  ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 258 మంది ప్రాణాలు కోల్పోయారు.  దీంతో అత్యవసర పరిస్థితిని విధిస్తూ సిరిసేన ఆదేశాలు జారీ చేశారు. దాని గడువు శనివారంతో ముగుస్తుంది. కఠిన చట్టాల నుంచి ఉపశమనం కల్పిస్తామని ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుని  ఎమర్జెన్సీని కొనసాగిస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. […]

శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడిగిస్తూ నిర్ణయం
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Jun 22, 2019 | 5:31 PM

శ్రీలంకలో జరిగిన ఆత్మాహుతి దాడి నేపధ్యంలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన విధించిన ఎమర్జెన్సీని కొనసాగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెలలో ఈస్టర్ వేడుకల సందర్భంగా  ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 258 మంది ప్రాణాలు కోల్పోయారు.  దీంతో అత్యవసర పరిస్థితిని విధిస్తూ సిరిసేన ఆదేశాలు జారీ చేశారు. దాని గడువు శనివారంతో ముగుస్తుంది. కఠిన చట్టాల నుంచి ఉపశమనం కల్పిస్తామని ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుని  ఎమర్జెన్సీని కొనసాగిస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే  ఇప్పటికీ దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నట్టు తాను భావిస్తున్నాననీ.. ప్రజా భద్రత చట్టం కింద దేశంలో ఎమర్జెన్సీని పొడిగిస్తున్నామని సిరిసేన పేర్కొన్నారు.

పోలీసులు, భద్రతా దళాలకు విశేష అధికారాలు కట్టబెట్టడం సహా పలు కఠిన చట్టాలు ఎమర్జెన్సీ సందర్భంగా అమల్లో ఉంటాయి. అయితే  ఈస్టర్ రోజున జరిగిన నరమేథానికి  సంబంధించి  ఇప్పటి వరకు 100 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. కాగా గత నెలలో అధ్యక్షుడు సిరిసేన పలు దేశాల దౌత్యవేత్తలతో మాట్లాడుతూ శ్రీలంకలో  99 శాతం సాధారణ పరిస్థితి నెలకొందని ఈ నేపధ్యంలో జూన్ 22 నాటికి  ఎమర్జెన్సీ చట్టాలను ఎత్తేస్తామని చెప్పారు.

మరోవైపు  ఎమర్జెన్సీని ఎత్తివేస్తానన్న మైత్రిపాల సిరిసేన మళ్లీ మనసు ఎందుకు మార్చుకున్నారన్న దానిపై శ్రీలంక ప్రభుత్వ వర్గాలు మౌనం వహించాయి.  ఎమర్జెన్సీ పరిస్థితి కొనసాగడంతో ఇప్పటికీ దేశ రాజధాని కొలంబో  కట్టుదిట్టమైన భద్రత వలయంలోనే ఉంది.