Trump – Musk: స్నేహానికి ఎండ్ కార్డ్..! డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గం నుంచి వైదొలగిన ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య గ్యాప్ వచ్చింది. నిన్నటిదాకా ఏ విధానాలు నచ్చి ట్రంప్‌పై మస్క్‌కు అభిమానం పెరిగిందో..ఇప్పుడవే ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాయి.. అయితే ట్రంప్-మస్క్ స్నేహానికి బ్యూటీఫుల్ బిల్ గండికొట్టింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య గ్యాప్ వచ్చింది. నిన్నటిదాకా ఏ విధానాలు నచ్చి ట్రంప్‌పై మస్క్‌కు అభిమానం పెరిగిందో..ఇప్పుడవే ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాయి అయితే ట్రంప్-మస్క్ స్నేహానికి బ్యూటీఫుల్ బిల్ గండికొట్టింది. ఎన్నికల సమయంలో మస్క్.. ట్రంప్ కు సపోర్ట్ చేశారు. కానీ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే డోజ్ నుంచి వైదొలిగిన మస్క్.. ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన బిల్లును బహిరంగంగానే వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది..
ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్.. ట్రంప్ యంత్రాంగం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ చీఫ్‌గా తన పదవీకాలం ముగిసిందని ట్వీట్ చేశారు. ‘వృథా ఖర్చులను తగ్గించే అవకాశం ఇచ్చినందుకు’ అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన చేశారు.
డోజ్ మిషన్ కాలక్రమేణా బలపడుతూ ప్రభుత్వ వ్యవస్థలో ఒక జీవిత విధానంగా మారుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. అయితే, ట్రంప్‌పై విమర్శలు చేసిన మర్నాడే ఆయన డోజ్‌కు రాజీనామా చేయడం గమనార్హం. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ పేరుతో ట్రంప్ తీసుకొచ్చిన కొత్త పన్ను విధానాన్ని విమర్శించిన మస్క్.. అది బడ్జెట్ లోటును పెంచుతుందని, డోజ్ బృందం చేసిన కృషిని అడ్డుకుంటుందన్నారు.. ఒక బిల్లు పెద్దగా ఉండవచ్చు, అందంగా ఉండవచ్చు. కానీ రెండూ కలిసుండటం కష్టమన్నారు మస్క్
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై ట్రంప్ ఒవల్ ఆఫీసులో స్పందిస్తూ.. ఈ బిల్లులో తనకి నచ్చని అంశాలున్నాయి. అయితే, కొన్ని అంశాలు మాత్రం నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఇంకా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు. అలాగే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలంటూ ట్రంప్ పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
