Drone: పాకిస్థాన్‌లోని భార‌త ఎంబ‌సీ వ‌ద్ద డ్రోన్ క‌ల‌క‌లం.. ఆగ్రహం వ్యక్తంచేసిన భారత్..

|

Jul 02, 2021 | 2:15 PM

Indian High Commision in Pakistan: దేశ సరిహద్దుల్లో ఇప్పటికే డ్రోన్లు అలజడి రేపుతున్నాయి. దీంతో భారత్ సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసింది. ఈ తరుణంలోనే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో

Drone: పాకిస్థాన్‌లోని భార‌త ఎంబ‌సీ వ‌ద్ద డ్రోన్ క‌ల‌క‌లం.. ఆగ్రహం వ్యక్తంచేసిన భారత్..
Drone spotted at Indian High Commision in PAK
Follow us on

Indian High Commision in Pakistan: దేశ సరిహద్దుల్లో ఇప్పటికే డ్రోన్లు అలజడి రేపుతున్నాయి. దీంతో భారత్ సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసింది. ఈ తరుణంలోనే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న భార‌తీయ రాయ‌బార కార్యాల‌యం వ‌ద్ద డ్రోన్ క‌ల‌క‌లం సృష్టించింది. హై క‌మిష‌న్ ఆఫీసు కాంపౌండ్‌లో డ్రోన్ సంచ‌రించిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల భార‌త్ తీవ్ర నిర‌స‌న వ్యక్తంచేసింది. గత కొన్ని రోజుల నుంచి క‌ాశ్మీర్ స‌రిహ‌ద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు సంచరిస్తున్న విష‌యం తెలిసిందే. కాశ్మీర్‌లో ఉన్న ఓ ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌పైన కూడా డ్రోన్ దాడి జరిగింది. దీనిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కేసుపై దర్యాప్తు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. అయితే.. ఆదివారం ఎయిర్‌బేస్‌పై జ‌రిగిన డ్రోన్ దాడిలో పాక్‌కు చెందిన ఉగ్ర సంస్థల హ‌స్తం ఉన్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు.

కాగా.. జూన్ 26వ తేదీన భార‌తీయ ఎంబసీ వ‌ద్ద ఉన్న రెసిడెన్షియ‌ల్ ప్రాంతంలో డ్రోన్ క‌నిపించిన‌ట్లు పేర్కొంటున్నారు. అదే రోజున జ‌మ్మూలోని ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడి జ‌రిగింది. ఆ త‌ర్వాత భద్రతా బలగాలు స‌రిహ‌ద్దుల్లో ప‌లుమార్లు డ్రోన్లను గుర్తించాయి. పాక్ ఉగ్రవాదులు డ్రోన్లు వాడుతున్న విష‌యం గురించి భారత్ ఇప్పటికే ఐక్యరాజ్యసమిలో నిర‌స‌న కూడా వ్యక్తంచేసింది. ఆయుధాలు, డ్రగ్స్ స‌ర‌ఫ‌రా కోసం పాక్ ఉగ్రసంస్థలు డ్రోన్లు వాడుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ తరుణంలోనే శుక్రవారం ఉదయం కూడా సరిహద్దుల్లో డ్రోన్ కనిపించింది. అప్రమత్తమైన బలగాలు కాల్పులు జరపడంతో డ్రోన్ వెనక్కి వెళ్లినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

Also Read:

Nirav modi:అన్నకు చెల్లి సాయం.. నీరవ్ మోడీ సోదరి రూ. 17 కోట్లు చెల్లించింది..ఇక కేసెక్కడిది ?

Darbhanga Blast Case: దర్భాంగ బ్లాస్ట్ కేసులో మరో ట్విస్ట్..! అందులో ఉన్నది ఇద్దరు కాదు.. ముగ్గురు..!