AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirav modi:అన్నకు చెల్లి సాయం.. నీరవ్ మోడీ సోదరి రూ. 17 కోట్లు చెల్లించింది..ఇక కేసెక్కడిది ?

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో వజ్రాల వర్తకుడు నీరవ్ మోడీ సోదరి పూర్వి మోడీ మొత్తానికి కేసు నుంచి బయటపడింది. ఈ కేసులో ఆమె అప్రూవర్ గా మారినందుకు బదులుగా ఈడీ ఆమెపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టకుండా ' 'క్షమాభిక్ష' పెట్టింది . దీనికి బదులు ఆమె లండన్ బ్యాంకులో...

Nirav modi:అన్నకు చెల్లి సాయం.. నీరవ్ మోడీ సోదరి రూ. 17 కోట్లు చెల్లించింది..ఇక  కేసెక్కడిది ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 01, 2021 | 7:55 PM

Share

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో వజ్రాల వర్తకుడు నీరవ్ మోడీ సోదరి పూర్వి మోడీ మొత్తానికి కేసు నుంచి బయటపడింది. ఈ కేసులో ఆమె అప్రూవర్ గా మారినందుకు బదులుగా ఈడీ ఆమెపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టకుండా ‘ ‘క్షమాభిక్ష’ పెట్టింది . దీనికి బదులు ఆమె లండన్ బ్యాంకులో ఉన్న రూ. 17.25 కోట్లను భారత ప్రభుత్వానికి ట్రాన్స్ ఫర్ చేసింది.ఇక్కడి ఓ బ్యాంకులో నా పేరిట నీరవ్ మోడీ ఈ సొమ్మును రెమిట్ చేసినట్టు తెలిసిందని.. దీన్ని భారత ప్రభుత్వానికి ట్రాన్స్ ఫర్ చేస్తున్నానని ఆమె చెప్పినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ డబ్బు నాది కాదని.. అందువల్ల నా బ్యాంక్ అకౌంటు లో ఉన్న ఈ డబ్బును మీకు బదిలీ చేస్తున్నానని పూర్వి మోడీ వెల్లడించినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈమె కో-ఆపరేట్ చేసిన ఫలితంగా రూ. 17.25 కోట్లను రీకవర్ చేయగలిగామని ఈ డీ అధికారులు తెలిపారు.

రూ. 13,500 కోట్ల పీఎన్ బీ ఫ్రాడ్ కేసులో ఈమెపైన.., ఈమె భర్త మయాంక్ మెహతా పైన క్రిమినల్ చర్యలకు ఈడీ ఉపక్రమించగా.. తాము అప్రూవర్లుగా మారుతామని, ఈ కేసులో మీకు సహకరిస్తామంటూ గత జనవరి 4 న వీరి నుంచి ఈడీకి దరఖాస్తులు అందాయి. దాంతో వీరిని ఈడీ అధికారులు ‘క్షమించి’ వదిలివేశారు. కాగా ఇప్పటికీ నీరవ్ మోడీ లండన్ లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. భారత్ కు ఆయన అప్పగింత వ్యవహారం ఇంకా తేలాల్సి ఉంది. ‘

మరిన్ని ఇక్కడ చూడండి: ఆదిత్య 369 లా.. కళ్యాణ్ రామ్ బింబిసార..! మూడు పాత్రలలో కనిపించనున్న నందమూరి హీరో :Kalyan Ram Bimbisara Movie.

 వైరల్ అవుతున్న వరుణ్ బాక్సింగ్ వీడియో…! గని సినిమా కోసం కష్టపడుతున్న మెగా ప్రిన్స్ :video of Varun Tej.

పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు..కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు మహిళ చేసిన మారాం..నవ్వకుండా వీడియో చుడండి :Viral Video.

ఈ చిన్నోడు ఓ టాప్‌ హీరో కొడుకు తెలుసా..?తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకున్న స్మాల్ హీరో..:Star Hero Son video.

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!