భారతీయులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్
దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.. చీకటిని పారదోలే ఈ పండుగ విశిష్టతను చాటిచెప్పేట్టుగా ప్రస్తుతం ప్రపంచం చీకటి రోజుల నుంచి వెలుగులోకి అడుగు...
దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.. చీకటిని పారదోలే ఈ పండుగ విశిష్టతను చాటిచెప్పేట్టుగా ప్రస్తుతం ప్రపంచం చీకటి రోజుల నుంచి వెలుగులోకి అడుగు పెడుతున్నదని మోరిసన్ వ్యాఖ్యానించారు..ఆస్ట్రేలియాలో నివసిస్తున్న 70 లక్షల మంది భారత సంతతి ప్రజలే కాకుండా మిగతా వారు కూడా పండుగను ఘనంగా జరుపుకుంటారు..
వెలుగుల పండుగ విశిష్టత తెలుసు కానీ ఎప్పుడూ అనుభవపూర్వకంగా తెలుసుకోలేదని, ఈసారి తెలిసివచ్చిందని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనాతో అతలాకుతలం అవుతున్నాయి.. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి..
ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యింది.. ఈ ఏడాదంతా చీకట్లోనే మగ్గిపోయాం.. ఇప్పుడిప్పుడే వెలుతురు వస్తోంది.. రాబోయే రోజులు మరింత కాంతివంతంగా ఉంటాయి’ అని మోరిసన్ అన్నారు. ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత ఆంటోనీ అల్బనీస్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా దీపావళి పండుగ ఇచ్చే సందేశం సరిగ్గా సరిపోతుందని వ్యాఖ్యానించారు.