వూహాన్‌ ల్యాబ్‌ నుంచి కాదు.. జంతువుల నుంచి మనుషులకు సోకింది.. కరోనాపై డబ్ల్యూహెచ్‌వో (WHO) కీలక వ్యాఖ్యలు

కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. తాజాగా తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా ...

వూహాన్‌ ల్యాబ్‌ నుంచి కాదు.. జంతువుల నుంచి మనుషులకు సోకింది.. కరోనాపై డబ్ల్యూహెచ్‌వో (WHO) కీలక వ్యాఖ్యలు
Covid 19
Follow us
Subhash Goud

|

Updated on: Mar 31, 2021 | 2:40 PM

కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. తాజాగా తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా విజృంభిస్తోంది. అయితే కరోనా చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందని, అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిందని అమెరికాతో పాటు ప్రపంచదేశాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సైతం చైనాలో ఆరోపణలు గుప్పించాయి. కరోనా విషయంలో చైనాపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బృందం ఇటీవల చైనాలోని వూహాన్‌లో పర్యటించింది. కొన్ని రోజులుగా అక్కడే ఉండే అన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులను, వివిధ ప్రాంతాను పరిశీలించింది.

కరోనాపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కరోనా వైరస్‌ ల్యాబ్‌ నుంచి లీకవడం కాదు.. గబ్బిలాల ద్వారానే మనుషులకు సోకి ఉండే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో, చైనా అధ్యయనం తేల్చింది. ల్యాబ్‌ నుంచి లీకయ్యే అవకాశాలు చాలా తక్కువ అని, డబ్ల్యూహెచ్‌వో బృందం అభిప్రాయపడింది. అయితే ఈ రిపోర్టు ముందుగా ఊహించినట్లే ఉండటం గమనార్హం. ఇందులో చాలా పరిశోధనలకు అసలు సమాధానాలే లేవు. ఇప్పుడు కూడా ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకైన అంశాన్ని వదిలేసి మిగతా అంశాలపై మరింత విచారణ జరపాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో, చైనా సంయుక్త నివేదికలు తెలుపడం గమనార్హం.

గత జనవరి నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మూలాలను పరిశీలించింది. అయితే నివేదిక మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చింది. ప్రపంచమంతా ఈ మహమ్మారికి చైనాను బాధ్యులుగా చేస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్టు చైనా మారుస్తోందా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి కోవిడ్ విషయంలో మొదటి నుంచీ డబ్ల్యూహెచ్‌వోది చైనా అనుకూల ధోరణిగా ఉంది. జెనీవాలో ఉన్న ఓ దౌత్యవేత్త ద్వారా ఈ మూసాయిదా రిపోర్టును ప్రముఖ ఏజన్సీ అసోసియేటెడ్‌ సంపాదించింది. దీనిని డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా రిలీజ్‌ చేయాల్సి ఉంది. అయితే అందుకు ముందే మార్పులు ఏమైనా చేస్తారా..? అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఇప్పటికే కరోనా విషయంలో ప్రపంచ దేశాల నుంచి చైనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. కరోనాతో ప్రపంచమంతా నాశనం కావడానికి చైనాయే కారణమని, చైనాపై శాస్త్రవేత్తల బృందంతో లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

అయితే వైరస్‌ మూలాలను కనుగొనేందుకు వచ్చిన డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తల బృందానికి చైనా పలు పరిమితులు విధించింది. విచారణకు కీలకమైన పత్రాలేమి వారికి అందుబాటులో లేకుండా చేసిందని ఆరోపణలున్నాయి. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో పలువురు చైనా శాస్త్రవేత్తలను ఈ బృందం కలుసుకుంది.ఇక్కడ నాలుగు గంటలపాటు గడిపింది. వైరస్‌ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావించే వూహాన్‌ మార్కెట్‌లో నాలుగు గంటలపాటు గడిపింది. కానీ, చాలా రోజులపాటు ఏ పనీ లేకుండా తమకు కేటాయించిన హోటల్‌లోనే కాలక్షేపం చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి: Corona: మహారాష్ట్రలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు.. తాజాగా ఎంతమంది చనిపోయారంటే?

కరోనావైర‌స్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచిన సీఎస్ సోమేశ్ ‌కుమార్