- Telugu News Photo Gallery Viral photos Volleyball players start casual game in front of erupting volcano in iceland
Volcano in Iceland: ఓ వైపు మండుతున్న లావా, మరోవైపు ఆకతాయిల వాలీబాల్.. నెటిజన్లు ఫైర్
అగ్నిపర్వతం నుంచి మండుతున్న లావా వెలువడుతుంది. దానికి కొద్ది దూరంలో కొందరు వాలీబాల్ ఆడుతూ కనిపించారు.
Updated on: Mar 31, 2021 | 2:50 PM

ఐస్లాండ్‌లో భూకంపం కారణంగా ఫాగ్రడల్స్ పర్వత అగ్నిపర్వతం బలంగా పేలింది. 800 సంవత్సరాల తరువాత, ఈ అగ్నిపర్వతం నుండి చాలా లావా బయటకు వస్తోంది.

పర్వతం మొత్తం అగ్నిగా మారింది. మండుతున్న లావాను చూస్తే, అగ్ని నది ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ అగ్నిపర్వతానికి సంబంధించిన చాలా ఫోటోలు వైరల్‌గా మారాయి.

అగ్నిపర్వతం నుంచి కొద్ది దూరంలో కొందరు వ్యక్తులు వాలీబాల్ ఆడుతూ కనిపించారు. ఒక వైపు లావా అగ్నిపర్వతం నుంచి ప్రవహిస్తోంది, మరోవైపు నిర్లక్ష్యంగా వాలీబాల్ ఆడతున్నారు సదరు వ్యక్తులు. అగ్నిపర్వతం దగ్గర వారు వాలీబాల్ ఆడుతుండటం చూసి చాలా మంది షాక్‌కు గురయ్యారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ @ruteinars షేర్ చేశారు.

సాహసం పేరిట కొంతమంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇటువంటి పద్దతులను కరెక్ట్ కాదని నెటిజన్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
