అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బీభత్సం, నిమిషానికొకరు కరోనాతో మరణం
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది.. కరోనా విజృంభణతో ప్రజలు భయకంపితులవుతున్నారు. అక్కడ నిమిషానికొకరిని కరోనా వైరస్ బలితీసుకుంటున్నది..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది.. కరోనా విజృంభణతో ప్రజలు భయకంపితులవుతున్నారు. అక్కడ నిమిషానికొకరిని కరోనా వైరస్ బలితీసుకుంటున్నది.. మొన్నటి వరకు అక్కడ రెండున్నర లక్షల మందికిపైగా కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం అమెరికాలో 1.15 కోట్లకు పైగా యాక్టివ్ కేసులున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఇంతకు ముందు కంటే కరోనా విపరీతంగా వ్యాపిస్తోంది.. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. హాస్పటిల్స్ అన్ని కరోనా పేషంట్లతో నిండిపోయాయి.. హాస్పిటల్స్‌లో చాలినన్ని బెడ్స్ లేకపోవడంతో చర్చిలను, హోటళ్లను, రెస్ట్ రూమ్‌లను కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. చివరాఖరికి వాహనాల పార్కింగ్ ప్లేస్‌ల్లోనూ పడకలు ఏర్పాటు చేస్తున్నారు.. పేరుకు అగ్రరాజ్యమే కానీ అక్కడ కూడా సరిపడినంత వైద్య సిబ్బంది లేరు. ఈ కారణంగా కరోనా సోకినవారు నానా అవస్థలు పడుతున్నారు. రెండు మూడు వారాల కిందట రోజుకు 70 నుంచి 80 వేల కేసులు నమోదయ్యాయి.. ఇప్పుడా సంఖ్య లక్ష దాటుతోంది.. మొన్న ఒక్క రోజు లక్షన్నరకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.. గడచిన 24 గంటలలో 17 వందల మంది కరోనాతో కన్నుమూశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు వారాలలో ఈ సంఖ్య డబుల్ కావచ్చని ఆందోళన పడుతున్నారు. ఒక్క అమెరికాలోనే కాదు, చాలా దేశాలలో ఇదే పరిస్థితి నెలకొంది.. కరోనా కంట్రోల్ కావడం లేదు.. జపాన్‌లో నిన్న ఒక్క రోజే కొత్తగా 2,179 కేసులు నమోదయ్యాయి.. అక్కడ రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.. ఆఫ్రికాలో అయితే కరోనా కేసులు 20 లక్షలు దాటిపోయాయి.. ఆఫ్రికాలో ఉన్న 54 దేశాలన్ని కలిపి 48 వేల మందికిపైగా మరణించారు.. జోర్డాన్, మొరాకో, లెబనాన్, ట్యునీసియాలలో కూడా కరోనా జడలు విప్పుకుంటోంది.. ప్రజలను బలితీసుకుంటోంది..