ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెగలు
మానవాళి పాలిట మహమ్మారిలా పరిణమించిన కొవిడ్ 19 ఇప్పటికీ తన పంజా విసురుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. అటు రష్యాలోనూ కరోనా వైరస్..

మానవాళి పాలిట మహమ్మారిలా పరిణమించిన కొవిడ్ 19 ఇప్పటికీ తన పంజా విసురుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. అటు రష్యాలోనూ కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 5,195 పాజిటివ్ కేసులు నమోదు కాగా వైరస్ బారినపడిన వారిలో 2,823 మంది కోలుకున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా 61 మంది మృతి చెందారు. మొత్తంగా ఇప్పటివరకు రష్యాలో 10 లక్షల 25 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ దేశం ఆదివారం తెలిపింది. గత 24 గంటల్లో 84 ప్రాంతాల్లో 5,195 పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 1,156(22.2 శాతం) మందికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. మాస్కోలో 620 కేసులు, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 192 కేసులు, మాస్కోలో 167 కేసులు నమోదయ్యాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నా కరోనా కేసులు వస్తుండటం మాస్కో వాసుల్ని కలవరపెడుతోంది.