Iran: ఇరాన్ లో అట్టుడుకుతున్న నిరసనలు.. తీవ్ర రూపు దాల్చుతున్న ఆందోళనలు.. ఆంక్షలు విధించిన బ్రిటన్..
ఇరాన్ లో హిజాబ్ విషయంపై జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. హిజాబ్ వ్యతిరేక నిరసనలతో దేశం అట్టుడుకుతూనే ఉంది. ఈ నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్‌లోని నైతిక పోలీసు..

ఇరాన్ లో హిజాబ్ విషయంపై జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. హిజాబ్ వ్యతిరేక నిరసనలతో దేశం అట్టుడుకుతూనే ఉంది. ఈ నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్‌లోని నైతిక పోలీసు విభాగంపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. 22 ఏళ్ల కుర్దిష్ మహిళ మహ్స అమీని మరణంతో మొదలైన నిరసనలు.. దేశవ్యాప్తంగా తీవ్రస్థాయికి చేరాయి. పోలీసుల అదుపులో ఉన్న అమీనిని తీవ్రంగా కొట్టి, హింసించడం వల్లే మృతి చెందిందని ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు చేశారు. హిజాబ్‌ను మంటల్లో వేస్తూ కాలుస్తున్నారు. అంతే కాకుండా జట్టు కత్తిరించుకొని నిరసనలు తెలుపుతున్నారు. మహ్సా అమినీ హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.అనంతరం ఆమె మూడు రోజుల తర్వాత కస్టడీలో మరణించడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.
అనేక మంది నటీమణులు ముందుకు వచ్చి ఇరాన్ మహిళలకు తమ మద్దతును ప్రకటించారు. తాజాగా హిజాబ్ వ్యతిరేక నిరసనలకు సంఘీభావంగా మంగళవారం ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో జరిగిన సమావేశంలో నెస్సెట్ సభ్యురాలు షర్రెన్ హాస్కెల్ తన జుట్టును కత్తిరించుకుంది. ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక పోరాటానికి సంఘీభావంగా ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఇజ్రాయెల్ పార్లమెంటేరియన్, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ ఎంబసీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నిరసనకారులకు సెల్యూట్ చేశారు.




మరోవైపు హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఇంతలోనే ఈ నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్‌లోని నైతిక పోలీసు విభాగంపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. దీంతో పాటు ఈ విభాగం జాతీయ చీఫ్ మొహమ్మద్ గాచీ, టెహ్రాన్ డివిజన్ హెడ్ హజ్ అహ్మద్ మిర్జాయ్ పైనా ఇదే విధమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అమెరికా ఇప్పటికే ఈ తరహా ఆంక్షలు విధించగా.. యూరోపియన్ యూనియన్ సైతం సిద్ధమవుతున్నట్లు సమాచారం.