Pakistan: ఎంపీని లైవ్ లో చెంప పగులగొట్టిన ఇమ్రాన్ ఖాన్ సన్నిహితురాలు.. వైరల్ గా మారిన వీడియో!
Pakistan: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన అసభ్యమైన చేష్టలు, ప్రకటనల కారణంగా తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. ఆయన పార్టీ నాయకులు కూడా తమ ప్రధాని లానే ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్నారు.
Pakistan: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన అసభ్యమైన చేష్టలు, ప్రకటనల కారణంగా తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. ఆయన పార్టీ నాయకులు కూడా తమ ప్రధాని లానే ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ ఎపిసోడ్లో, ఇమ్రాన్ సన్నిహిత నాయకురాలు డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ తన దూకుడు ప్రవర్తనతొ వివాదంలో చిక్కుకున్నారు. ఫిర్దౌస్ ఆశిక్ అవన్ ఒక టీవీ షో రికార్డింగ్ సమయంలో పాకిస్తాన్ ఎంపీని చెంపదెబ్బ కొట్టారు. చెంపదెబ్బ కొట్టిన ఎంపీ బిలావాల్ భుట్టో పార్టీ పిపిపికి చెందిన ఖాదిర్ మండోఖేల్ అని తెలుస్తోంది.
ఎంపీని చెంపదెబ్బ కొట్టే వీడియో ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో నాయకులు ఇద్దరూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై అవన్ కోపంతో ఎంపీని చెంపదెబ్బ కొట్టారు. ఎక్స్‌ప్రెస్ టీవీలో జావేద్ చౌదరి హోస్ట్ చేసిన టాక్ షో ‘కల్ తక్’ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఖాదీర్ మండోఖేల్‌తో తీవ్రమైన వాదనను ప్రారంభిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.. దీంతో ఆషిక్ అవన్ తన సహనాన్ని, సంయమనాన్ని కోల్పోయారు. దీని తరువాత, ఆమె ఎంపీపై దాడికి దిగారు. ఎంపీ కాలర్ను పట్టుకున్నారు. ఈ గొడవ తరువాత, అవన్ ఎంపీ మాండోఖేల్‌ను చెంపదెబ్బ కొట్టారు.
ఎంపీని చెంపదెబ్బ కొడుతున్న సన్నివేశం మీరూ ఇక్కడ చూడొచ్చు..
Pakistan’s new heavyweight champion, Dr Firdous Ashiq Awan. #FirdousAshiqAwan pic.twitter.com/0mp2L1pIy1
— Hamza Azhar Salam (@HamzaAzhrSalam) June 9, 2021
అందుకే కొట్టాను..
ఈ సంఘటన తరువాత, ఫిర్దౌస్ ఆశిక్ అవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంఘటనపై వివరణ ఇచ్చారు. పిపిపి ఎంపి ఖాదీర్ మండోఖేల్ తనను, తన తండ్రిని వేధించాడని, బెదిరించాడని అన్నారు. నేను ఎంపీని చెంపదెబ్బ కొట్టడానికి ఇదే కారణం. ఆత్మరక్షణలో భాగంగానే ఇది జరిగింది అని చెప్పారు. అంతే కాకుండా ఖాదీర్ మండోఖేల్‌పై మానసిక వేధింపుల కేసును కూడా నమోదు చేయబోతున్నట్లు అవాన్ తెలిపారు. ఈ సంఘటన పూర్తి వీడియోను విడుదల చేయాలని అవన్ ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌ను డిమాండ్ చేశారు. మొత్తం వీడియో చూసిన తర్వాత, తను ఖాదీర్ మండోఖేల్‌ను ఎందుకు చెంపదెబ్బ కొట్టాడో ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు.
ఫిర్డస్ అవన్ దూకుడు ప్రవర్తనకు ప్రసిద్ది..
ఫిర్దస్ ఆశిక్ అవన్ పిఎం ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక సహాయకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ సిఎంకు స్పెషల్ అసిస్టెంట్. అవన్ దూకుడు ప్రవర్తనకు పేరుగాంచారు. కానీ ఈ కారణంగా చాలా సార్లు ఆమె కూడా ఇబ్బందుల్లో పడ్డారుది. అంతకుముందు, ఆమె సియాల్‌కోట్‌లోని అసిస్టెంట్ కమిషనర్‌ను తిట్టడం ఒక వీడియోలో కనిపించింది. ఇందుకోసం ఆమెను తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో, ఈసారి ఆమె ఒక ఎంపీని చెంపదెబ్బ కొట్టడం ద్వారా మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు.
Viral News: చైనా ఫుడ్.. అక్కడి ప్రజలు బొద్దింకల సూప్‌ను తెగ తింటారట.? రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఔట్.!