థాయిలాండ్ లోని స్టోర్ లో దూరిన పాము… ఆ తరువాత ఏం జరిగిందో చూడాల్సిందే !:Viral Video.
థాయిలాండ్ లోని ఓ స్టోర్ లో ఎంట్రెన్స్ లోకి ఎలా వచ్చిందో గానీ ఓ పాము అక్కడి డోర్ పై వేలాడుతూ కనిపించింది. అయితే ఓ యువతి ఆ డోర్ దగ్గరి ఫ్రిజ్ వద్దకు వచ్చినా దాన్ని గమనించలేదు.. కానీ ఆ స్నేక్ ఎప్పుడు కిందికి జారిందో...
థాయిలాండ్ లోని ఓ స్టోర్ లో ఎంట్రెన్స్ లోకి ఎలా వచ్చిందో గానీ ఓ పాము అక్కడి డోర్ పై వేలాడుతూ కనిపించింది. అయితే ఓ యువతి ఆ డోర్ దగ్గరి ఫ్రిజ్ వద్దకు వచ్చినా దాన్ని గమనించలేదు.. కానీ ఆ స్నేక్ ఎప్పుడు కిందికి జారిందో గానీ దిగిపోయింది. ఎందుకో ఆ యువతి కిందకు చూడగా జర్రున జారుతూ పోతున్న దాన్ని చూసి షాక్ తింది . అంతే ! ఒక్కసారిగా అక్కడి నుంచి భయంతో పరుగు లంకించుకుంది. పాము అదే స్టోర్ లో అక్కడి నుంచి మరో చోటికి పాకిపోయింది.ఈ వీడియో సొషల్క్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఆ షాపు దగ్గరలో ఎలాంటి గుట్టలు గానీ.. పొదలు గానీ లేవు. కానీ ఆ పాము అక్కడికి ఎలా వచ్చిందన్నదానిపై షాపు యజమాని ఆరా తీస్తున్నాడు.. పాములను పట్టేవారిని తీసుకువచ్చి వారితో బాటు తానూ షాపులోని అణువణువూ గాలించడం ప్రారంభించాడు.
సామాన్యంగా థాయిలాండ్ లోని భవనాలు, ఇళ్లలో పాములు కనిపించడం పరిపాటి అట.. కానీ ఈ సారి ఏకంగా షాపులోనే సర్పం దర్శనమిచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: YS Jagan Delhi Tour Live Video : హస్తినకు సీఎం జగన్.. కొవిడ్ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం.
Corona 3rd wave : తెలుగు రాష్ట్రాలుపై థర్డ్ వెవ్ కలవరం..అప్రమత్తం అయిన ప్రభుత్వాల సంచలన నిర్ణయాలు.