AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తెగిపోయిన హైడ్రోజన్ బెలున్ తాడు.. రెండు రోజులు గాల్లోనే రైతు.. చివరకు..

ఓ వ్యక్తి రెండు రోజుల పాటు గాల్లోనే గడిపాడు.. హైడ్రోజన్ బెలూన్ సహాయంతో పండ్లు కోస్తుండగా.. బెలున్ తాడు తెగిపోయింది. దీంతో అతను వందలాది కిలోమీటర్లు బెలున్‌తో పాటు ప్రయాణించాడు.

Viral News: తెగిపోయిన హైడ్రోజన్ బెలున్ తాడు.. రెండు రోజులు గాల్లోనే రైతు.. చివరకు..
Hydrogen Balloon
Shaik Madar Saheb
|

Updated on: Sep 09, 2022 | 9:34 AM

Share

Hydrogen Balloon: ఓ వ్యక్తి రెండు రోజుల పాటు గాల్లోనే గడిపాడు.. హైడ్రోజన్ బెలూన్ సహాయంతో పండ్లు కోస్తుండగా.. బెలున్ తాడు తెగిపోయింది. దీంతో అతను వందలాది కిలోమీటర్లు బెలున్‌తో పాటు ప్రయాణించాడు. చివరకు సురక్షితంగా కిందకు దిగాడు. ఈ షాకింగ్ ఘటన చైనాలో చోటుచేసుకుంది. హైడ్రోజన్‌ బెలూన్‌ సాయంతో చెట్టు నుంచి పైన్‌ కాయలు కోస్తుండగా.. ఉన్నట్టుండి దాని తాడు తెగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో బెలూన్‌లో ఉన్న ఓ వ్యక్తి కిందకు దూకగా.. మరో వ్యక్తి అందులోనే చిక్కుకుపోయాడని తెలిపారు. రెండు రోజులపాటు గాలిలోనే చక్కర్లు కొడుతూ.. ఎట్టకేలకు క్షేమంగా కిందికి దిగినట్లు చైనా అధికారులు తెలిపారు. ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఓ అటవీ ఉద్యానవనంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

హైడ్రోజన్ బెలున్ సహాయంతో హు (40) తో పాటు మరో వ్యక్తి పైన్ గింజలను సేకరిస్తున్నారు. ఈ సమయంలో బెలూన్ తాడు ఆకస్మాత్తుగా తెగిపోయింది. ఒకరు కిందకు దూకగా.. హూ దానిలోనే చిక్కుకుపోయాడు. అయితే.. దూకిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బెలూన్ తోపాటు అదృశ్యమైన హు కోసం గాలించారు. అయితే.. అతని దగ్గర సెల్‌ఫోన్ ఉంది. మరుసటి రోజు సెల్‌ఫోన్ సిగ్నల్స్ కలవడంతో అధికారులు అతనిని సంప్రదించారు. సురక్షితంగా ల్యాండ్ కావడానికి పలు సూచనలు చేశారు. బెలూన్‌ నుంచి నెమ్మదిగా గాలిని తగ్గించమని చెప్పారు. వారి సలహాలతో హు.. రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫాంగ్‌జెంగ్ ప్రాంతంలో భూమి మీదకు చేరాడు. ఈశాన్య దిశగా 320 కిలోమీటర్లు (200 మైళ్లు) గాలిలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. అతను భూమిని చేరుకోవడానికి మరో రోజు పట్టిందన్నారు. అయితే.. హు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని.. గాలిలో నిలబడి ఉండటంతో వెన్నునొప్పితో బాధపడుతున్నాడని తెలిపారు.

మరిన్ని వివరాలు చెప్పేందుకు చైనా అధికారులు నిరాకరించినట్లు మీడియా పేర్కొంది. కాగా.. పైన్‌ కాయలను చైనా వంటల్లో ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి