AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump – Modi: ‘ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, భారత్‌కు నేనే బెస్ట్ ఫ్రెండ్’.. ట్రంప్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Trump - Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుు చేశారు. ‘భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి..

Trump - Modi: ‘ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, భారత్‌కు నేనే బెస్ట్ ఫ్రెండ్’.. ట్రంప్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Trump Modi
Shiva Prajapati
|

Updated on: Sep 09, 2022 | 9:38 AM

Share

Trump – Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుు చేశారు. ‘భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి.. అంతేకాదు భారత్కు నేనే బెస్ట్ ఫ్రెండ్’ అని అన్నారు. అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన అలా అనడం వెనుకున్న ఆంతర్యం ఏంటా? అని ఆలోచనలో పడ్డారు అంతా. మరి ఇండియా, మోదీలపై ట్రంప్ కితాబుల వెనుక కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికా అధ్యక్షుడి హోదాలో 2020 ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చిన డొనాల్డ్ ట్రంప్‌‌.. మన ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. మోదీతో కలిసి అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగింది. ఇక, మోదీపై తరుచూ ప్రశంసలు గుప్పించే ట్రంప్.. తాజాగా మళ్లీ భారత ప్రధానిపై అభిమానం చాటుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. భారత ప్రధాని చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. అంతేకాదు, భారత్‌కు నా కంటే మంచి మిత్రుడు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసి డొనాల్డ్ ట్రంప్.. మునుపటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇప్పటి అధ్యక్షుడు జో బైడెన్ కంటే తనతోనే భారత్‌కు మెరుగైన సంబంధాలు ఉన్నాయన్నారు.

మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటున్నారా? అని అడిగితే.. ‘‘నేను పోటీచేయాలని అందరూ కోరుకుంటున్నారు’ అని బదులిచ్చారు. దీంతో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ ప్రకటించారు. మరోసారి అమెరికా అధ్యక్షుడైతే మీ ప్రాధాన్యాలు ఏమిటని ప్రశ్నించగా.. అమెరికాను ఇంధన సాధికార దేశంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా అమెరికా నిలదొక్కుకోవాలి అనేది తన ఆశయంగా పేర్కొన్నారు. ప్రస్తుత జో బైడెన్ సర్కారు దాన్ని సమీప కాలంలోనూ సాధించే పరిస్థితి లేదన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మునుపటిలా వెలుగొందాలని, ఉద్యోగ కల్పన రేటు పెరగాలన్నారు. తన హయాంలో అలాంటి విజయాలన్నీ నమోదయ్యాయని చెప్పారు. ఇప్పుడవి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదన్నారు ట్రంప్.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!