Snake In Wine Bottle: వైన్ బాటిల్ లో పాము.. సంవత్సరం తరువాత తీసి చూస్తే ఏమైందంటే..
Snake In Wine Bottle: వైన్ సీసాలో ఏడాది కిందట పెట్టిన పాము అసలు బతికి ఉంటదా? అసలు సంవత్సరం పాటు పాములు అలా బతికి ఉండగలవా? అవి మూత తీసినప్పడు కాటేస్తాయా? అసలు ఈ పాముల గోలేంటిరా బాబు అనుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే..
Snake In Wine Bottle: వైన్ సీసాలో ఏడాది కిందట పెట్టిన పాము అసలు బతికి ఉంటదా? అసలు సంవత్సరం పాటు పాములు అలా బతికి ఉండగలవా? అవి మూత తీసినప్పడు కాటేస్తాయా? అసలు ఈ పాముల గోలేంటిరా బాబు అనుకుంటున్నారు. ఇలాంటి వింతలు చైనా(china)లో కనిపిస్తుంటాయి. పైన ప్రశ్నలకు సమాధానం అవుననే తెలుస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. చైనాకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి చికిత్స(Treatment) కోసం స్నేక్ వైన్ సీసాను కొనుగోలు చేశాడు. తీరా దాని మూత తీయగా లోపల ఉన్న పాము ఒక్కసారిగా బయటకు వచ్చి అతనిపై దాడి చేసింది. ఇలాంటి వింత వైద్య విధానాలు, ఆహారపు అలవాట్లు, సాంప్రదాయాలకు నిలయమైన చైనా దేశంలో స్నేక్ వైన్ ను సంప్రదాయ వైద్య చికిత్సలో వినియోగిస్తుంటారు. అది అక్కడ చాలా ప్రాచుర్యం పొందిన పద్ధతి కూడా. ఇందులో భాగంగా ఒక విషపూరిత పామును వైన్ పోసిన సీసాలో ఉంచుతారు. ఆ తరువాత దానికి మూతపెట్టి, అనేక నెలలపాటు అలానే వదిలేస్తారు. అలా చేస్తే.. ఆ వైన్ ఔషధంలా మారుతుందని అక్కడి వారి నమ్మకం.
దీనిని సేవించటం వల్ల రుమాటిసం, ఆర్థరైటిస్, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నది చైనీయుల నమ్ముతుంటారు. చైనా హీలాంగ్జియాంగ్కు చెందిన ఓ వ్యక్తి ఏడాది క్రితం మూడు స్నేక్ వైన్ జార్లు కొన్నాడు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతడి కుమారుడి చికిత్స కోసం వాటికి కొనుగోలు చేశాడు. అయితే.. కొన్న వెంటనే వాటిని తెరవలేదు. ఎక్కువకాలంపాటు వైన్లోనే పాము ఉంటే.. ‘ఔషధ గుణాలు’ మరింత బాగుంటాయని వాటిని అలానే వదిలేశాడు. ఇటీవల దాదాపు ఏడాది తర్వాత వాటిని తెరిచాడు. అనూహ్యంగా మూడు జార్లలోని పాములు బతికే ఉన్నాయని అతడు చెప్పాడు. వాటిలో ఒకటి తనను కాటేసిందని అన్నాడు. వెంటనే ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు చికిత్స అందించి తనను బతికించారని ఆ చైనా వ్యక్తి వెల్లడించాడు.
వైన్ జార్లో ఏడాదిపాటు పాములు బతికే ఉన్నాయన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాలి లోపలకు వెళ్లేలాగా జార్ మూత కాస్త తెరిచే ఉంచితే.. ఆల్కహాల్లో పాములు బతికే ఉండగలవని కొంతమంది అంటున్నారు. పాములు సుప్తావస్థలోకి వెళ్లగలవని.. అప్పుడు వాటికి చాలా తక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం అవుతుందని వారు అంటున్నారు. కానీ జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఆల్కహాల్ వంటి ద్రావణంలో మునిగి ఉన్న ఏ పాము కూడా గంట కన్నా ఎక్కువ బతకలేదని.. ఇలా జరగటం అసాధ్యమని వారు అంటున్నారు. ఇతర జంతువుల్లాగా వాటికి కూడా బతకడానికి నీరు, ఆహారం, ఆక్సిజన్ అవసరమని వారు అంటున్నారు.
ఇవీ చదవండి..
Insurance: టాక్స్ ఆదాకోసం ఇన్సూరెన్స్ చేయడం మంచి పనేనా..? చాలా మంది చేసే తప్పు అదే..