Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Vaccine Capacity: షాకింగ్‌.. చైనా కరోనా టీకాపై సంచలన విషయాలు బయటపెట్టిన బ్రెజిల్‌ పరిశోధకులు

China Vaccine Capacity: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంటే.. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్ర స్థాయిలో ....

China Vaccine Capacity: షాకింగ్‌.. చైనా కరోనా టీకాపై సంచలన విషయాలు బయటపెట్టిన బ్రెజిల్‌ పరిశోధకులు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 14, 2021 | 5:17 PM

China Vaccine Capacity: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంటే.. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్ర స్థాయిలో శ్రమించాయి. ఇక వ్యాక్సిన్‌ విషయంలో చైనా టీకా సంబంధించి సమాచారం అంతా కూడా గోప్యమే. చైనా ప్రభుత్వంతో పాటు ఈ టీకాకు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుతున్న దేశాలు కూడా టీకాకు సంబంధించి కీలక సమాచారం విడుదల చేయలేదు. వ్యాక్సిన్‌ సామర్థ్యం అద్భుతం అంటూ రకరకాల ప్రకటనలు తప్ప నిపుణులు కోరుతున్న కీలక వివరాలు మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇది చైనా టీకాలపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తోంది.

సామర్థ్యం 50 శాతమే..

ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లో తాజాగా ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. చైనా ప్రభుత్వరంగానికి చెందిన సినోవాక్‌ టీకా సామర్థ్యం కేవలం 50.4 శాతమేనని అక్కడి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బుటాంటన్‌‌ బమోమెడికల్‌ సెంటర్‌ నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు. ఇదే సంస్థ గతంలో చైనా టీకా సామర్థ్యం ఏకంగా 70 శాతమని ప్రకటించింది. ట్రయల్స్‌కు సంబంధించిన ప్రాథమిక విశ్లేషణ అనంతరం ఈ ప్రకటన చేసింది. దీంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా చైనాపై నమ్మకం పెంచుకున్నారు.

టీకా సామర్థ్యం గురించి బయటకు పొక్కడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలకు త్వరగా టీకాను అందుబాటులోకి తీసుకురావాలన్న బ్రెజిల్‌ ప్రభుత్వానికి ఈ పరిణామం తీవ్ర నిరాశను మిగిల్చింది. తాజాఆ విడుదల చేసిన ఫలితాల్లో స్వల్ప తీవ్రత కలిగిన కరోనా కేసులపై జరిపిన విశ్లేషణ కూడా జోడించామని బుటాంటాన్‌ సంస్థలో క్లినికల్‌ విభాగం డైరెక్టర్ వెల్లడించారు. ఇలా విడతల వారీగా టీకా భద్రత, సామర్థ్యాలకు సంబంధించి సమాచారాన్ని విడుదల చేయడంపై బ్రెజిల్‌లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ దేశాల అనుమతులు పొందాలంటే కరోనా టీకాకు కనీసం 50 శాతం ప్రభావశీలత కలిగి ఉండాలి. ఫైజర్‌, మోడర్నా టీకాల సామర్థ్యం 95 శాతానికి దగ్గర ఉంటే ఆక్స్‌ఫ్డ్‌ టీకా 90 శాతం వరకు ఉంది. దేశంలో టీకా ప్రక్రియ అమలు చేసేందుకు బ్రెజిల్‌ రెండు టీకాలపై ఆశలు పెట్టుకుంది. అందులో ఒకటి ఆక్సఫర్డ్‌, రెండోది చైనాకు సైనోఫార్మ్‌ కంపెనీ రూపొందించిన టీకా. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఫలితాలు బ్రెజిల్‌ను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి.

అయితే చైనా టీకా ప్రయోగ పరీక్షలు, కొనుగోళ్లకు సంబంధించిన డీల్స్‌ను చాలా దేశాలు రద్దు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లో సివోవాక్‌ టీకా ప్రయోగ పరీక్షలకు చైనా ముందుగా ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ తర్వాత ప్రయోగ పరీక్షలకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని బంగ్లాదేశ్‌ భరించాలంటూ ఇరకాటంలో పెట్టేసింది. దీంతో ఈ ఒప్పందం బంగ్లాదేశ్‌ రద్దు చేసుకుంది. బ్రెజిల్‌ కూడా కొన్నాళ్లు ఈ టీకా ప్రయోగ పరీక్షలను నిలిపివేసింది.

అయితే కొత్తగా వెలువడిన డేటాతో బ్రెజిల్‌లో టీకా కార్యక్రమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బుటాంటన్‌ను ప్రభుత్వ వర్గాలు అదనపు డేటాను సమర్పించాలని ఆదేశించాయి. ఇప్పటి వరకు బ్రెజిల్‌ కేవలం చైనా టీకాతో పాటు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాపై ఆధారపడింది.

Covaxin Consent Letter: తెలంగాణలో కోవాగ్జిన్‌ టీకా వేసుకునే వారికి అంగీకారపత్రం తప్పనిసరి: వైద్యారోగ్య శాఖ