Virus Strain : క్రికెట్ లో కరోనా కలకలం.. ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీకి కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ గా నిర్ధారణ
కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడంలేదు. సామాన్యులనుంచి సెలబ్రిటీలవరకు అందరు కరోనా బారిన అపడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే

Virus Strain: కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడంలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబిటీలకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో సామాన్య ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. తాజాగా క్రికెట్ లోనూ కరోనా కలకలం రేపుతోంది. ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ కరోనా బారిన పడ్డాడు. అతడికి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ గా నిర్దారణ అయ్యింది.
ఈ కొత్త రకం కరోనా వైరస్ కేసు శ్రీలంకలో ఇది మొదటిది కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు శ్రీలంక అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కొత్త రకం కరోనా అతడినుంచి వేరే వాళ్లకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు శ్రీలంక ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. పది రోజుల కిందట శ్రీలంక టూర్‌కు వచ్చిన మొయిన్ అలీకి పాజిటివ్ రావడంతో మిగతా ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది. ఈ టూర్‌లో భాగంగా రెండు టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. గురువారమే తొలి టెస్ట్ ప్రారంభమైంది. అటు ఇతనితో సన్నిహితంగా ఉన్న మరో ఇంగ్లండ్ క్రికెటర్ క్రిస్ వోక్స్ కూడా తొలి టెస్ట్‌కు దూరం కానున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :