Man lost Bitcoin Password : ఓ చిన్న పాస్ వర్డ్ అతని జీవితాన్నే మార్చేసింది.. ఏకంగా ఎన్ని కోట్లు కోల్పోయాడో తెలుసా..!
ఆన్ లైన్ లో నగదు లావాదేవీలు జరపడం మొదలు పెట్టక పాస్ వర్డ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఒకొక్కసారి ఈ పాస్ వర్డ్ ను మర్చిపోయి అనేక ఇబ్బందులు

Man lost Bitcoin Password :ఆన్ లైన్ లో నగదు లావాదేవీలు జరపడం మొదలు పెట్టక పాస్ వర్డ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రసుత టెక్ ప్రపంచంలో పాస్ వర్డ్ తో భద్రత ఏర్పడింది. అయితే ఒకొక్కసారి ఈ పాస్ వర్డ్ ను మర్చిపోయి అనేక ఇబ్బందులు పడుతుంటాం.. కొన్నిటికి మళ్ళీ పాస్ వర్డ్ సెట్ చేసుకుంటాం.. మరికొంటిని ఏమీ చెయ్యలేక వదిలేస్తాం.. అయితే ఓ వ్యక్తి పాస్ వర్డ్ మరచిపోవడంతో ఏకంగా రూ.1,800 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని పోగొట్టుకునే ప్రమాదంలో పడ్డాడు.
జర్మనీకి చెందిన స్టీఫెన్ థామస్. ప్రోగ్రామర్ అయిన స్టీఫెన్.. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్నాడు. కొన్నేళ్లుగా ఇతడు సంపాదించిన డబ్బులతో బిట్‌కాయిన్లను కొనుగోలు చేశాడు. వీటి విలువ భారత కరెన్సీ లో దాదాపు భారత కరెన్సీలో రూ.1,800 కోట్ల విలువ. ఇటీవల బిట్‌కాయిన్ విలువ 50 శాతం పడిపోయింది. దీంతో తన డబ్బులను తిరిగి తీసుకుందామని స్టీవెన్ యత్నించాడు. అయితే అందుకు తన అకౌంట్‌లో ఐరన్‌కీ అనే హార్డ్‌డ్రైవ్‌ను అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అన్‌లాక్ చేస్తే వచ్చే ప్రైవేట్ కీ ద్వారా డిజిటల్ వ్యాలెట్‌ను ఆయన యాక్సెస్ చేసుకోవచ్చు. తద్వారా అందులో ఉన్న 7,002 బిట్ కాయిన్స్ అతడి సొంతమవుతాయి. ఆ కాయిన్లను ఐరన్‌కీ అనే ఎన్‌క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్‌లో పాస్‌వర్డ్‌తో భద్రపరుచుకున్నారు.
పొరపాటున 10 సార్లు పాస్‌వర్డ్ తప్పుగా నమోదు చేస్తే ఆ హార్డ్ డ్రైవ్‌లో ఉన్న మొత్తం డేటా మాయమవుతుంది. అంటే బిట్‌కాయిన్లన్నీ గల్లంతవుతాయి. అయితే థామస్ తన పాస్‌వర్డ్‌ను మరచిపోవడంతో సమస్య మొదలైంది. ఇప్పటికే 8 సార్లు పాస్‌వర్డ్‌ను తప్పుగా నమోదు చేశారు. ఇంక రెండు ప్రయత్నాలే మిగిలాయి. వాటిలోనూ విఫలమైతే ఇక ఆయన ఖాతాలో చిల్లిగవ్వ మిగలదు. మిగతా బ్యాంకు ఖాతాల్లాగా పాస్‌వర్డ్‌లను మర్చిపోతే సంబంధిత సంస్థలు కొత్త పాస్‌వర్డ్‌ను ఇచ్చే సౌలభ్యం కూడా క్రిప్టో కరెన్సీలో ఉండదు. అన్నట్లు ఇప్పటివరకూ పాస్‌వర్డ్‌లు మర్చిపోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోల్పోయిన క్రిప్టో కరెన్సీ సొమ్ము రూ.9.5 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
Also Read: 20 నెలల చిన్నారి మరణిస్తూ.. ఐదుగురికి ప్రాణాలు పోసింది. అతిచిన్న వయసులో అవయదాతగా నిల్చింది.