AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin Consent Letter: తెలంగాణలో కోవాగ్జిన్‌ టీకా వేసుకునే వారికి అంగీకారపత్రం తప్పనిసరి: వైద్యారోగ్య శాఖ

Covaxin Consent Letter: భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా వేసుకునే లబ్దిదారులు తప్పనిసరిగా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ..

Covaxin Consent Letter: తెలంగాణలో కోవాగ్జిన్‌ టీకా వేసుకునే వారికి అంగీకారపత్రం తప్పనిసరి: వైద్యారోగ్య శాఖ
Follow us
Subhash Goud

|

Updated on: Jan 14, 2021 | 4:46 PM

Covaxin Consent Letter: భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా వేసుకునే లబ్దిదారులు తప్పనిసరిగా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఆ పత్రంపై సంతకం చేసిన వారికే టీకా వేస్తారని తెలిపింది. కోవాగ్జిన్‌ ట్రయల్స్‌ పూర్తికానందున అంగీకారపత్రం అడుగుతున్నారని తాము భావిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రం ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ భారత్‌ బయోటెక్‌ సంస్థ లబ్దిదారుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాలని కోరిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరిగిందని బుధవారం ఆయన మీడియాకు వెళ్లడించారు. అయితే అంగీకార పత్రంలో ఎటువంటి అంశాలు ఉంటాయో ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. సాధారణంగా ట్రయల్స్‌లో ఉన్నవాటి విషయంలో మాత్రమే అంగీకార పత్రం తీసుకుంటారని, అన్ని పరీక్షలు పూర్తయ్యాక ఆక్స్‌ఫర్డ్‌ కోవిషీల్డ్‌ టీకాకు ఎలాంటి అంగీకార పత్రం అడగడం లేదని అన్నారు. కాగా, తెలంగాణకు 20 వేల డోసుల కోవాగ్జిన్‌లు బుధవారం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. వాటిని హైదరాబాద్‌ స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌లో ఉంచినట్లు చెప్పారు.

16వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. 40 ప్రైవేటు, 99 ప్రభుత్వ కేంద్రాల్లో ఈ టీకాలు వేయాలని ముందుగా నిర్ణయించగా, ఆ నిర్ణయాల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. ప్రైవేటు కేంద్రాల్లో టీకాల కార్యక్రమాన్ని వాయిదా వేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 139 కేంద్రాల్లో టీకాలు వేయాలని నిర్ణయించారు. తొలి రోజు 55,270 మంది వైద్య సిబ్బందికి టీకా వేస్తారు. వ్యాక్సినేషన్‌ మొదలైన వారం రోజుల తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కానుందని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత సర్టిఫికేట్‌

కాగా, కరోనా టీకా వేసుకున్న వారందరికీ కోవిడ్‌ యాప్‌ ద్వారా సర్టిఫికేట్‌ అందజేయనున్నారు. లబ్దిదారుల ఫోన్‌ నెంబర్‌కు ఆయా సర్టిఫికేట్‌ లింక్‌ ద్వారా పంపుతారు. మొదటి డోసు టీకా వేసుకున్నాక రెండో టీకా ఎప్పుడు ఎక్కడ వేసుకోవాలో లబ్దిదారుడి మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ వస్తుంది. రెండో డోస్‌ సమయం దగ్గర పడుతున్న సమయంలో గుర్తు చేసే మెసేజ్‌లు కూడా వస్తాయి. రెండు నెలల పాటు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకే టీకా వేస్తారని శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి సమస్యలు, సైడ్‌ ఎఫెక్ట్‌లు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రతి టీకా నిల్వ కేంద్రంలో 24 గంటల భద్రత ఏర్పాట్లు చేస్తారు.

Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాకు చేరిన వ్యాక్సిన్..

'మీ ఆనందం కోసం మా కొడుకును జోకర్ చేస్తారా': సంజన గణేషన్
'మీ ఆనందం కోసం మా కొడుకును జోకర్ చేస్తారా': సంజన గణేషన్
మే 1 నుంచి కొత్త రూల్‌.. వారు స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించలేరు
మే 1 నుంచి కొత్త రూల్‌.. వారు స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించలేరు
ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?