AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pneumonia: డేంజర్ బెల్స్.. ప్రపంచం ముంగిట మరో వైరస్ ముప్పు.. చైనా నుంచి ఐర్లాండ్‌కు వ్యాప్తి

H9N2 అనేది ఒక రకమైన వైరస్. ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈ వైరస్ మానవులకు సోకి.. వేగంగా వ్యాపిస్తోంది. H9N2 అనేది ఇన్‌ఫ్లుఎంజాకి చెందిన  వేరియంట్ అని వైద్యులు చెప్పారు. ఈ వైరస్ మనుషులకు కూడా సోకుతుందని వేగంగా వ్యాపిస్తోందని ఆందోళలన వ్యక్తం చేస్తున్నారు. H9N2 వైరస్ అడవి పక్షులలో కనిపిస్తుంది. పక్షుల నుండి మానవులకు ఈ వైరస్ సోకినట్లు చెబుతున్నారు. అయితే మనుషుల్లో దీని వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ... ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారు ఈ వైరస్ బారిన సులభంగా పడతారు. చైనాలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు కారణమైన బ్యాక్టీరియా సంక్రమణ ఐర్లాండ్‌లో మొదలైందని..

Pneumonia: డేంజర్ బెల్స్.. ప్రపంచం ముంగిట మరో వైరస్ ముప్పు.. చైనా నుంచి ఐర్లాండ్‌కు వ్యాప్తి
China Pneumonia
Surya Kala
|

Updated on: Nov 27, 2023 | 4:31 PM

Share

ప్రపంచం ముంగిట మరోసారి కొత్త మహమ్మారి ముప్పు పొంచి ఉంది. క్రమంగా చైనాలోని పలు ప్రాంతాల్లో న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఫ్లూ, ఇన్‌ఫ్లుఎంజా H9N2 కారణంగా న్యుమోనియా కేసులు వ్యాప్తి చెందుతున్నాయని చైనా ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. H9N2 అనేది ఒక రకమైన వైరస్. ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈ వైరస్ మానవులకు సోకి.. వేగంగా వ్యాపిస్తోంది. H9N2 అనేది ఇన్‌ఫ్లుఎంజాకి చెందిన  వేరియంట్ అని వైద్యులు చెప్పారు. ఈ వైరస్ మనుషులకు కూడా సోకుతుందని వేగంగా వ్యాపిస్తోందని ఆందోళలన వ్యక్తం చేస్తున్నారు.

H9N2 వైరస్ అడవి పక్షులలో కనిపిస్తుంది. పక్షుల నుండి మానవులకు ఈ వైరస్ సోకినట్లు చెబుతున్నారు. అయితే మనుషుల్లో దీని వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ… ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారు ఈ వైరస్ బారిన సులభంగా పడతారు. H9N2 వైరస్ లక్షణాలు ఫ్లూ లాగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వ్యాధులు కూడా సంభవించవచ్చు.

ఐర్లాండ్ లో కేసు నమోదు

చైనాలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు కారణమైన బ్యాక్టీరియా సంక్రమణ ఐర్లాండ్‌లో మొదలైందని.. ఈ వ్యాధి బారిన పడిన కేసు నమోదైందని ఆ దేశ  అధికారులు ధృవీకరించారు. మైకోప్లాస్మా న్యుమోనియా వ్యాప్తి ఉన్నట్లు గత నెలలో హెల్త్ ప్రొటెక్షన్ సర్వైలెన్స్ సెంటర్ (HPSC)కి తెలియజేయబడింది. ఈ న్యుమోనియా కేసు ఐర్లాండ్‌ దేశంలో కొన్ని  సంవత్సరాల తర్వాత మొదటిదిగా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

న్యుమోనియాకు కారణం..

హెచ్9ఎన్2 వైరస్ వల్ల దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో చైనాలో న్యుమోనియా కేసులు పెరగడానికి H9N2 వైరస్ కారణం కావచ్చునని.. ఈ విషయం గురించి ఇప్పుడే స్పష్టంగా ఏమీ చెప్పలేమని చెప్పారు. అయితే చైనాలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతోంది.

H9N2 ఎక్కడ నుండి వచ్చింది?

1966లో అమెరికాలో ఈ వైరస్ మొదటి కేసు నమోదైందని డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. ఈ వైరస్ మొదటి సారిగా ఒక అడవి పక్షిలో కనిపించింది. కొన్ని సంవత్సరాల తరువాత  మానవులలో కూడా  ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. మానవ సంక్రమణ మొదటి కేసు 1988లో నమోదైంది. దీని తరువాత భారతదేశం, పాకిస్తాన్ , బంగ్లాదేశ్‌తో సహా అనేక దేశాలలో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. కేసులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వైరస్ సోకిన బాధితుల్లో లక్షణాలు తీవ్రంగా ఉండవు.  అయినప్పటికీ చైనాలో శ్వాసకోశ వ్యాధులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.

న్యుమోనియా అంటువ్యాధి

న్యుమోనియా అంటువ్యాధి.. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుందని డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు తీవ్ర జ్వరం ఉంటే ఇన్ఫెక్షియస్ న్యుమోనియా వ్యాధిగా భావించాలని చెప్పారు. చైనాలో ఈ న్యుమోనియా విస్తరిస్తోంది. పిల్లలు వేగంగా ఇన్ఫెక్షన్లకు గురి కావడానికి ఇదే కారణమని తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..