Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.. చైనా వింత వాదన.. సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు
Wuhan Lab: కరోనా వైరస్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చైనాలోని వుహాన్ ల్యాబ్. ఇదే ల్యాబ్‌లో వైరస్ పుట్టిందని ఒక వైపు ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. తాజాగా చైనా..
Wuhan Lab: కరోనా వైరస్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చైనాలోని వుహాన్ ల్యాబ్. ఇదే ల్యాబ్‌లో వైరస్ పుట్టిందని ఒక వైపు ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. తాజాగా చైనా ఓ వింత వాదనను తెరపైకి తీసుకువచ్చింది. కరోనా వైరస్‌కు సంబంధించి వుహాన్ ల్యాబ్‌లో ఎన్నో పరిశోధనలు చేస్తుండగా, దీనిని పరిగణలోకి తీసుకుని వుహాన్ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని వింత వాదనకు దిగుతోంది. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జౌ లిజియాన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ అధ్యయనంలో వుహాన్ ల్యాబ్ చేస్తున్న కృషిని గుర్తిస్తూ మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు వుహాన్ల్యాబ్శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. వైరస్‌ను తొలుత గుర్తించడంలో, వ్యాక్సిన్ల రూపకల్పనలో కీలకంగా పనిచేసిన సైంటిస్టులంతా నోబెల్ బహుమతిని పొందటానికి అర్హులే అంటూ చెప్పుకొచ్చారు. కోవిడ్-19 జన్యు శ్రేణిని మొదట చైనా శాస్త్రవేత్తలే గుర్తించారు. వైరస్‌ను ఇక్కడ మొదట గుర్తించినంత మాత్రాన, వుహాన్ కరోనా వైరస్‌కు మూలం కాదు. కానీ ఇక్కడి ల్యాబ్ నుంచే వైరస్ లీకైనట్లు అంతర్జాతీయ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ఇప్పటికే చైనా ప్రభుత్వం వుహాన్ ల్యాబ్‌కి ఆ దేశ అత్యుత్తమ సైన్స్ అవార్డును ప్రధానం చేసింది. కరోనా వైరస్ జీనోమ్‌ని గుర్తించడంలో వుహాన్ ల్యాబ్‌చేసిన కృషికి గానూ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ దానికి అవుట్ స్టాండింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్‌మెంట్ ప్రైజ్‌ను 2021లో ప్రకటించింది.
అయితే ఒక వైపు కరోనా వైరస్ చైనాలోని వుహాన్ల్యాబ్ నుంచే లీకైందని అంతర్జాతీయ సమాజం అనుమానం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు, చైనా మాత్రం ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. పైగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ వింత వాదనకు దిగుతోంది. వార్తల్లో నిలిచిన ప్రతిసారి వుహాన్ ల్యాబొరేటరీస్‌ను ఆ దేశం వెనకేసుకొస్తూ వస్తోంది. తాజాగా చైనాలోనే అత్యంత టాప్ సైన్స్ అవార్డుల్లో ఒకటిగా పరిగణించే సైన్స్ అండ్ టెక్నాలజీ అఛీవ్మెంట్ అవార్డుకు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని నామినేట్ చేసింది. కోవిడ్-19 మూలాలు, ఎపిడమాలజీ, పాథోజెనిక్ మెకానిజంపై పరిశోధన చేయడంలో వుహాన్ ల్యాబ్ చేసిన కృషి చెప్పలేనిదని డ్రాగన్ దేశం కొనియాడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు వూహాన్ల్యాబొరేటరీ వేసిన పునాది, సాంకేతిక అనితర సాధ్యమంటూ పొగడ్తలతో ముంచెత్తింది. ఇక చైనా డిమాండ్‌పై సోషల్ మీడయాలో ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఒకవేళ వుహాన్ ల్యాబ్‌కి మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే.. ఐసీస్‌కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సి ఉంటుంది.. అవును మన జీవితాలను నాశనం చేయడానికి వుహాన్ ల్యాబ్ ఎంతో కష్టపడి కరోనాను అభివృద్ధి చేసింది. ఆ కృషిని గుర్తించి దానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే..అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
We must admit, the work of the Wuhan Institute of Virology really has touched all of our lives, hasn’t it? https://t.co/eicvXkz94v
— Jim Geraghty (@jimgeraghty) June 21, 2021
Effectiveness of Chinese COVID vaccines questioned after outbreaks in some countries using them | Just The News https://t.co/qfS31JhI4s
— John Solomon (@jsolomonReports) June 23, 2021
If Wuhan Lab in China deserves Nobel Prize for Medicine according to China; then ISIS deserves the Nobel peace prize too.
— Shining Star ?? (@ShineHamesha) June 24, 2021