China Covid-19: చైనాలో కరోనా మరణ మృదంగం.. రోజుకు 9వేల మంది మృతి.. లక్షల్లో కేసులు..!

|

Jan 01, 2023 | 8:47 PM

చైనాలో కరోనా టెర్రర్‌ కంటిన్యూ అవుతోంది. జీరో కోవిడ్‌ పాలసీ కారణంగా రోజుకు 9000 మంది చనిపోతున్నారని అంచనా. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు దక్షిణ కొరియా , జపాన్‌ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి

China Covid-19: చైనాలో కరోనా మరణ మృదంగం.. రోజుకు 9వేల మంది మృతి.. లక్షల్లో కేసులు..!
China Coronavirus
Follow us on

చైనాలో మాత్రమే కాదు పొరుగుదేశాల్లో కూడా కరోనా వేగంగా విజృంభిస్తోంది. దక్షిణకొరియాలో పరిస్థితి అదుపు లోనే ఉన్నప్పటికి చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను కంపల్సరీ చేశారు దక్షిణకొరియా అధికారులు. జపాన్‌లో కూడా కరోనా హడలెత్తిస్తోంది. అయితే, చైనాలో లక్షల్లో కరోనా కేసులు, మరణమృదంగం కొనసాగుతోంది. జీరో కోవిడ్‌ పాలసీ తరువాత చైనాలో రోజుకు 9000 మంది చనిపోతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. చైనాలోని వివిధ రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ల సంఖ్యను రిపోర్టు చేసే విధానంలో మార్పులకు ముందు నమోదైన గణంకాలు, గతంలో జీరో కొవిడ్‌ను పాటించిన దేశాల్లో ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత నమోదైన కేసుల రేటును విశ్లేషించి ఈ అంచనాకు వచ్చారు. ఒక్క డిసెంబర్‌లోనే చైనాలో లక్ష మంది వరకు కరోనాతో చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు.

ఒక్క డిసెంబర్‌ లోనే చైనాలో సుమారు 2 కోట్ల పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరిలోఓ ప్రతి రోజు గా 34 లక్షల కేసులు రావొచ్చని సూచిస్తున్నారు. చైనా కొవిడ్‌ గణాంకాల్లో పారదర్శకత గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా స్పష్టతను ఇవ్వలేకపోతోంది. కరోనా కేసుల విషయంలో నెలకు ఒక్కసారి మాత్రమే వివరాలు వెల్లడిస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కావాలనే కేసులు , మరణాల సంఖ్యను చైనా ప్రభుత్వం దాచిపెడుతోందని భావిస్తున్నారు. తమ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ అవుట్‌బ్రేక్‌ ఉందని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ధ్రువీకరించింది. చైనాలో మార్చినాటికి కనీసం 100 కోట్ల మందికి వైరస్‌ సోకవచ్చని అంచనా వేస్తున్నారు.

జీరో కోవిడ్‌ పాలసీపై తీవ్ర విమర్శలు రావడంతో చైనా ఆరోగ్యశాఖ అధికారులు కొద్దిరోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. చైనా నుంచి జన్యుసమాచారం, మరణాల వివరాలు, ఆసుపత్రుల్లో చేరిన్న వాళ్ల గణంకాలు మరింత లోతుగా ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో అధికారులు కోరారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చైనాపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా చైనా నుంచి వచ్చేవారికి కొవిడ్‌ టెస్టుల్లో నెగెటివ్‌ రావాలని కెనడా పేర్కొంది. మరో వైపు చైనా నుంచి వచ్చేవారిని తమ దేశంలోకి అనుమతించమని మొరాకో స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..