Nuclear Terror: ప్రమాద ఘంటికలు.. అణు కుంపటి మధ్య భారత్.. పాకిస్తాన్ నలుమూలలా అణ్వాయుధ తయారీ..

ఇప్పుడు మనం సరిగ్గా అణు కుంపటి మధ్యలో ఉన్నాం. ఒకవైపు చైనా.. మరో వైపు పాకిస్తాన్ అణ్వాయుధాలను పోగేసుకుని మరీ కూచున్నాయి. మనకంటే వెనుక ఉండాల్సిన పాకిస్తాన్ వద్ద మన దేశం కంటే ఎక్కువ అణ్వాయుధాలతో ఉంది.

Nuclear Terror: ప్రమాద ఘంటికలు.. అణు కుంపటి మధ్య భారత్.. పాకిస్తాన్ నలుమూలలా అణ్వాయుధ తయారీ..
Nuclear Weapons
Follow us
KVD Varma

|

Updated on: Sep 14, 2021 | 8:03 PM

Nuclear Terror: ఇప్పుడు మనం సరిగ్గా అణు కుంపటి మధ్యలో ఉన్నాం. ఒకవైపు చైనా.. మరో వైపు పాకిస్తాన్ అణ్వాయుధాలను పోగేసుకుని మరీ కూచున్నాయి. మనకంటే వెనుక ఉండాల్సిన పాకిస్తాన్ వద్ద మన దేశం కంటే ఎక్కువ అణ్వాయుధాలతో ఉంది. ఇక చైనా మనకంటే చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మనకంటే రెట్టింపు అణు బలంతో చైనా ఉంది. ఇక్కడ సమస్య ఏమిటంటే.. రెండు దేశాలూ మనతో కయ్యానికి కాలు దువ్వే పని నిరంతరం చేస్తుండటమే.

అమెరికాలోని ‘బులెటిన్ ఆఫ్ ది అటమిక్ సైంటిస్ట్’ నివేదిక ప్రకారం మన దేశంలో అణ్వాయుధాలు (అణు వార్ హెడ్స్) 156 నుంచి 160 వరకూ ఉన్నాయి. చైనా వద్ద 350 ఉన్నాయి. ఇక పాకిస్తాన్ 165 అణువార్ హెడ్స్ తో సవాలు విసురుతోంది. ఇక ఇప్పటికే పాక్ లో అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాల పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా విస్తరించాయి. అణ్వాయుధాల ఉత్పత్తి జోరు ఇదే స్థాయిలో సాగితే 2025 నాటికి పాక్ వద్ద ఉండే వార్ హెడ్ల సంఖ్య 200ను మించుతాయని ఈ బులిటెన్ వెల్లడించింది.

భారీ ఎత్తున సంప్రదాయ ఆయుధాలతో భారత్ దాడులు చేస్తే..

ఎప్పుడైనా పాకిస్తాన్ పై భారత్ భారీ ఎత్తున సంప్రదాయ ఆయుధాలతో దాడులు చేస్తే.. పాక్ అణ్వాయుధాలతో ప్రతీకారం తీర్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లక్ష్యంతోనే అణ్వాయుధ సంపత్తిని పాక్ పెంచుకుంటున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యం..

తక్కువ దూరాల్లో లక్ష్య ఛేదనకుద్దేశించిన ఆయుధాల అభివృద్ధిపై పాకిస్తాన్ దృష్టి పెట్టింది. వాటితో పాటు.. సముద్రం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు, గాలి లోంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు, లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులు వీటితో పాటు ప్రస్తుతం పాక్ అమ్ముల పొదిలో.. 6 అణు వార్ హెడ్లను మోసుకుపోగల బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఇందులో 60-70 కి.మీ దూరంలో లక్ష్యాలను ఛేదించే (హతఫ్-9) సాలిడ్ ఫ్యూయల్ క్షిపణులున్నాయి. మీడియం రేంజ్ క్షిపణుల్లో.. షహీన్-2, కొత్త రకం షహీన్-3 క్షిపణులతో పాటుగా 2,750 కి.మీ పరిధి కలిగిన షహీన్-3 క్షిపణి కూడా ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ అణు క్షిపణుల పరిధిలోకి ఇజ్రాయిల్ వచ్చి చేరింది. అంటే పాక్ నుంచి మిసైల్ ఉపయోగిస్తే ఇజ్రాయిల్ మీద దడి జరుపుతుంది. షహీన్-3 క్షిపణులను బెలూచిస్తాన్ లో మోహరించే యోచనలో పాకిస్తాన్ ఉన్నట్టు చెబుతున్నారు. మల్టీపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్(ఎంఐఆర్వీ) ను పాకిస్తాన్ అభివృద్ధి చేస్తోంది. అణువార్ హెడ్లను మోసుకుపోయే సామర్థ్యమున్న ‘అబ్దీల్’ బాలిస్టిక్ క్షిపణిని ఎంఐఆర్వీతో అనుసంధానంచేసే ప్రయత్నంలో పాక్ ప్రయత్నాలలో ఉంది. మిరేజ్-3, మిరేజ్-5 ఫైటర్ విమానాల ద్వారా అణు వార్ హెడ్లను ప్రయోగించేందుకు పాక్ సన్నద్ధమవుతోంది.

పాక్ అణ్వాయుధ ముడిపదార్థాల పరిశ్రమ..

అణ్వాయుధ ముడిపదార్థాల ఉత్పత్తి పరిశ్రమ పాకిస్తాన్ లో వేగంగా విస్తరిస్తోంది. ఇస్లామాబాద్ కు తూర్పులోని ఖుటాలో యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇస్లామాబాద్ కు ఉత్తరంలో గడ్వాల్ వద్ద మరో ప్లాంట్ నిర్మాణం పూర్తికావస్తోంది. నైలోర్ లో ప్లుటోనియం సంగ్రహణకు నిర్మించిన రీప్రాసెసింగ్ ప్లాంట్ విస్తరణ వేగంగా జరుగుతోంది. పంజాబ్ లోని చష్మా వద్ద మరో రీప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణ దశలో ఉంది. అదేవిధంగా కాలా చిత్త దార్ మౌంటెన్ రేంజ్ గ్రౌండ్ జీరో వద్ద అణు సామర్థ్యమున్న క్షిపణులు, లాంచర్ల ఉత్పత్తి చేస్తున్నారు. వాహ్ సరిహద్దులో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సైతం అణు వార్ హెడ్ల ఉత్పత్తి సాగుతోందని పరిశోధకులు అనుమానిస్తున్నారు.

అంతర్జాతీయ అణ్వాయుధ తయారీ ముడిపదార్థాలు ప్యానెల్ ప్రకారం.. 2020 నాటికి పాక్ వద్ద 3,900 కిలోల నాణ్యమైన యురేనియం ఉందని అంచనా. అంతే కాకుండా, 410 కిలోల వెపన్ గ్రేడ్ ప్లుటోనియం నిల్వలున్నట్లు అంచనా వేస్తున్నారు.

అణ్వాయుధాలున్న తొమ్మిది దేశాల్లో భారత్ పరిస్థితి… జూన్ 2021 నాటికి..

దేశం                           అణ్వాయుధాలు రష్యా                                   6,255 అమెరికా                              5,550 చైనా                                       350 ఫ్రాన్స్‌                                    290 బ్రిటన్‌                                   225 పాకిస్తాన్‌                                165 భారత్‌                                 156-160 ఇజ్రాయల్‌                            90 ఉత్తర కొరియా                     45-50

ఇవి కూడా చదవండి: Fact Check: అంతరిక్షంలో తిరుగుతున్న మిస్టరీ శాటిలైట్‌.. నాసా చెప్పిందేమిటంటే..!

Girlfriend: తాగుబోతులకు, తిరుగుబోతులకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. నాకూ కావలి..వెదికి పెట్టమని ఎమ్మెల్యేకు ఓ యువకుడు లెటర్..

దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు