ప్రపంచంలోనే పొడమైన గడ్డమున్న వ్యక్తి.. మూడు సార్లు గిన్నీస్ రికార్డు
కొంతమంది అద్భుతాలు చేస్తూ గిన్నీస్ బుక్ లో చోటు సంపాదిస్తారు. మరికొంత మంది తమ రికార్డులను తామే బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతారు. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. కెనడాకి చెందిన సర్వన్ సింగ్ అనే వ్యక్తి తన తన పొడవైన గడ్డంతో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించి తన రికార్డునే బ్రేక్ చేసి అందరిని దృష్టిని ఆకర్షించాడు.
కొంతమంది అద్భుతాలు చేస్తూ గిన్నీస్ బుక్ లో చోటు సంపాదిస్తారు. మరికొంత మంది తమ రికార్డులను తామే బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతారు. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. కెనడాకి చెందిన సర్వన్ సింగ్ అనే వ్యక్తి తన తన పొడవైన గడ్డంతో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించి తన రికార్డునే బ్రేక్ చేసి అందరిని దృష్టిని ఆకర్షించాడు. వివరాల్లోకి వెళ్తే సర్వన్ సింగ్ తన గడ్డాన్ని ఎప్పుడూ కూడా ట్రిమ్మింగ్ చేయలేదు. చిన్నప్పటి నుంచి దాన్ని అలా పెంచుకంటూ వస్తున్నారు. 2008 లో మొదటి సారిగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డును సాధించాడు. అప్పుడు తన గడ్డం పొడువు 2.33 మీటర్లు గా ఉంది. అంతకు ముందు స్విడన్ కి చెందిన బిర్గర్ పెల్లస్ అనే వ్యక్తి అత్యంత పొడవైన గడ్డం ఉన్న వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఆ సమయంలో బిర్గర్ పెల్లస్ గడ్డం పొడవు 1.77 మీటర్లు ఉండేంది. అతని రికార్డును సర్వన్ సింగ్ బ్రేక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
2010లో ఇటలీలోని ఓ షో లో తన గడ్డాన్ని కొలిచి మరో రికార్డు సాధించాడు. అప్పుడు తన గడ్డం పొడవు 2.49 మీటర్లకు పెరిగింది. మళ్లీ 2022 అక్టోబర్ లో తన గడ్డాన్ని మళ్లీ కొలిచాడు. ఈసారి గడ్డం పొడవు 2.54 మీటర్లు ఉంది. మొత్తంగాసర్వన్ సింగ్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ మొత్తం మూడు సార్లు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించాడని బుధవారం రోజున గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ తెలిపింది. ఇంత పొడవైన గడ్డాన్ని చూసుకోవడం చాలా కష్టం. కానీ సర్వన్ సింగ్ మాత్రం తన పొడవైన గడ్డం అంటే ఇష్టమని.. దీనివల్ల ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని తెలిపాడు. ప్రస్తుతం తన గడ్డం బూడిద రంగులో ఉందని.. కానీ గతంలో కంటే అద్భుతంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
The owner of the world’s longest beard has now extended his record! ?
Sarwan Singh (Canada) now has a beard measuring over eight feet and three inches long. pic.twitter.com/6uuGwgh3xX
— Guinness World Records (@GWR) March 22, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..