Bungee Jump: ఈ టూరిస్ట్ వెరీ వెరీ లక్కీ.. 30 మీటర్ల నుంచి జంప్.. హఠాత్తుగా తెగిన తాడు.. నెట్టింట్లో వీడియో వైరల్..
చంగ్‌థాయ్ థాప్రాయ సఫారి, అడ్వెంచర్ పార్క్‌లో జిప్ లైన్‌లు, లైవ్-రౌండ్ షూటింగ్‌తో సహా అనేక రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. తన స్నేహితులు ఇతర యాక్టివిస్ లో పాల్గొనడానికి ఆసక్తిని చూపిస్తే.. తాను లార్క్‌పై బంగీ జంప్ చేయాలని నిర్ణయించుకున్నాట్లు మైక్ వెల్లడించాడు.
తెలుగు వారికీ బంగీ జంప్ అంటే వెంటనే మెగాస్టార్ చిరంజీవి బావగారు బాగున్నారా సినిమా కోసం చేసిన రియల్ స్టంట్ గుర్తుకొస్తుంది. తాజాగా ఓ టూరిస్టు బంగీ జంప్ చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగి చావు అంచుల వరకూ వెళ్ళొచ్చాడు. 39 ఏళ్ల ఈ వ్యక్తిని లక్కీ టూరిస్టు అని అంటున్నారు.. హాంకాంగ్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి 30 మీటర్లు ఎత్తైన పది అంతస్తుల నుంచి జంప్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇలా జంప్ చేస్తున్న సమయంలో తాగు తెగిపోయింది. తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని.. బాధితుడు తన బాధాకరమైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. షేర్ చేసిన క్షణంలో ఈ వీడియో వైరల్ అయ్యింది.
అయితే ఈ పర్యాటకుడి పూర్తి పేరు వెల్లడించడకుండా.. మొదటి పేరు మైక్ గా తెలిపాడు. తాను ఈ సంవత్సరం ప్రారంభంలో సెలవులను గడపడానికి స్నేహితుడితో కలిసి థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో పర్యటనకు వెళ్లినట్లు తెలిపాడు. ఈ సమయంలో బంగీ జంపింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు.
చంగ్‌థాయ్ థాప్రాయ సఫారి, అడ్వెంచర్ పార్క్‌లో జిప్ లైన్‌లు, లైవ్-రౌండ్ షూటింగ్‌తో సహా అనేక రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. తన స్నేహితులు ఇతర యాక్టివిస్ లో పాల్గొనడానికి ఆసక్తిని చూపిస్తే.. తాను లార్క్‌పై బంగీ జంప్ చేయాలని నిర్ణయించుకున్నాట్లు మైక్ వెల్లడించాడు.
మైక్ పోడియం నుండి దూకాడు.. నీటి దిగువకు చేరుకునే మిల్లీసెకన్ల ముందు తాడు తెగింది. దీంతో మైక్ నీటిలో పడిపోయాడు. అయితే తాను ఇలా జంప్ చేసే ముందు కళ్ళు మూసుకున్నానని .. తిరిగి బౌన్స్ అయ్యాక మళ్లీ కళ్ళు తెరవాలని ప్లాన్ చేసాను,” అని మైక్ CNN కి చెప్పాడు. “అయితే తాను కళ్ళు తెరిచే సమయంలో త్రాడు తెగిపోయిందని.. తన చుట్టూ నీరు ఉందని గ్రహించానని చెప్పాడు. నీళ్లలో పడుతున్న సమయంలో మైక్ స్పృహ కోల్పోయాడు.. కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. తనను ఎవరో బాగా కొట్టిన ఫీలింగ్ ఉందని చెప్పాడు. తనకు ఈత తెలియడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపాడు.
Terrifying moment a bungee cord snapped and sent a tourist crashing into the water. pic.twitter.com/mvyfQ1vE6l
— USA TODAY (@USATODAY) March 23, 2023
ఇదే విషయంపై అడ్వెంచర్ పార్క్ వ్యవస్థాపకుడు నితిత్ ఇంటిమ్ మాట్లాడుతూ.. బంగి జంప్ చేస్తున్న సమయంలో తాడు తెగిపోవడం చూడడం ఇదే మొదటిసారని పేర్కొన్నాడు.
“త్రాడు తెగిన వెంటనే మా సిబ్బంది అలెర్ట్ అయి.. మైక్ ను నీటిలో నుండి బయటకు తీశారు. అతను బాగున్నారా అని పలకరించి.. గాయపడిన మైక్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పాడు. అతని చికిత్స కు అయిన ఖర్చు ని మొత్తం తాము చెల్లించినట్లు చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..