Property Ban: ఇళ్లు ప్రజల కోసం, పెట్టుబడిదారుల కోసం కాదంటూ.. ఆ దేశంలో రెండేళ్ల వరకూ విదేశీయులు ఇళ్లు కొనడంపై నిషేధం

|

Jan 03, 2023 | 1:38 PM

ఆదివారం కొత్త కెనడియన్ చట్టం రూపొందించబడింది. రెండేళ్లపాటు ఇళ్ల కొనుగోళ్లను బ్యాన్‌ చేసింది. కెనడాలో విదేశీయులు ఇళ్లు కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది.

Property Ban: ఇళ్లు ప్రజల కోసం, పెట్టుబడిదారుల కోసం కాదంటూ.. ఆ దేశంలో రెండేళ్ల వరకూ విదేశీయులు ఇళ్లు కొనడంపై నిషేధం
Canada Property Ban
Follow us on

సొంత ఇల్లు అనేది ప్రతి వ్యక్తి కల. తాను ఎక్కడ నివసిస్తుంటే అక్కడ తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలని భావిస్తారు. తమ స్థాయికి తగినట్లు సొంత ఇంటిని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రణాళికలు వేస్తారు. అయితే విదేశీయులకు భారీ షాకిచ్చింది కెనడా. CNN నివేదిక ప్రకారం, విదేశీయులు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను పెట్టుబడులుగా కొనుగోలు చేయకుండా నిషేధిస్తూ జనవరి 1, ఆదివారం నాడు కొత్త కెనడియన్ చట్టం రూపొందించబడింది. రెండేళ్లపాటు ఇళ్ల కొనుగోళ్లను బ్యాన్‌ చేసింది. కెనడాలో విదేశీయులు ఇళ్లు కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. దేశంలో ఇళ్ల కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది కెనడా ప్రభుత్వం. ఈ నిషేధం రెండేళ్లపాటు అమల్లో ఉండనుంది. అయితే, ఈ నిషేధం కేవలం నివాస గృహాలకు మాత్రమే వర్తిస్తుందని… రిక్రియేషన్‌ ఆస్తులకు వర్తించదని చెప్పింది.

కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, స్థానికులు కొనుగోలు చేయలేని పరిస్థితి రావడంతో ఎన్నికల్లో హామీ ఇచ్చారు ట్రూడో. ప్రభుత్వంలోకి రాగానే విదేశీయులు ఇళ్లు కొనుగోలు చేయకుండా నిషేధం విధించారు. అయితే, కెనడాలోని ఇళ్లు 5శాతం మాత్రమే విదేశీయుల చేతిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాంతో, కెనడా గవర్నమెంట్‌ తీసుకున్న ఈ నిర్ణయం పెద్దగా ఫలితాన్ని ఇవ్వదని చెబుతున్నారు నిపుణులు. “ఇళ్లు ప్రజల కోసం, పెట్టుబడిదారుల కోసం కాదు” అని అంటున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…