ఆకాశంలో రమణీయ దృశ్యం… దగ్గరగా వచ్చిన గురుడు, శని గ్రహాలు.. కనివిందు చిత్రాన్ని బంధించిన కెమెరామన్

ఆకాశంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. గురుడు, శని గ్రహాలు దగ్గరగా చేరి ప్రకాశవంతంగా కనిపించాయి. ఇందుకు సంబంధించి రమణీయమైన దృశ్యాన్ని ఓ కెమెరామన్ సెడెన్ పార్క్‌ వేదికగా బంధించాడు.

ఆకాశంలో రమణీయ దృశ్యం... దగ్గరగా వచ్చిన గురుడు, శని గ్రహాలు.. కనివిందు చిత్రాన్ని బంధించిన కెమెరామన్
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 20, 2020 | 10:17 PM

ఆకాశంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. గురుడు, శని గ్రహాలు దగ్గరగా చేరి ప్రకాశవంతంగా కనిపించాయి. ఇందుకు సంబంధించి రమణీయమైన దృశ్యాన్ని ఓ కెమెరామన్ సెడెన్ పార్క్‌ వేదికగా బంధించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. భూమి నుంచి చూస్తే ఏవైనా రెండు గ్రహాలు అతి దగ్గరగా చేరినట్లు కనిపించే దృశ్యాన్ని కంజక్షన్‌గా పిలుస్తారు. ఇలా గురు శని గ్రహాలు కనిపించడాన్ని మాత్రం ‘గ్రేట్‌ కంజక్షన్‌’ అంటారు. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు నిత్యం కొంత దగ్గరగా వస్తున్నాయి. సోమవారం అతి దగ్గరగా చేరి అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. దాదాపు నాలుగు శతబ్దాల తర్వాత ఈ అద్భుతం చోటు చేసుకోనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. ఇందులో భాగంగానే ఈ అద్భుత దృశ్యం చెసుకుందన నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు 1623లో ఇలాంటి దృశ్యమే చోటుచేసుకుంది.