ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా కలవరం..బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై జర్మనీ, ఇటలీలో నిషేదాజ్ఞలు

ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా కలవరం నెలకొంది. దీంతో బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై జర్మనీ, ఇటలీ దేశాలు నిషేదాజ్ఞలు విధించింది.  బ్రిటన్‌ సహా...

ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా కలవరం..బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై  జర్మనీ, ఇటలీలో నిషేదాజ్ఞలు
Follow us

|

Updated on: Dec 20, 2020 | 10:40 PM

Flights From UK Canceled : ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా కలవరం నెలకొంది. దీంతో బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై జర్మనీ, ఇటలీ దేశాలు నిషేదాజ్ఞలు విధించింది.  బ్రిటన్‌ సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరంలోకి జారుకుంటున్నాయి. తాజాగా ఆ రెండు దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్‌ విమానాలపై నిషేధాజ్ఞలు విధించేందుకు జర్మనీ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

అయితే అక్కడి నుంచి వచ్చే విమానాలపై జర్మనీ దృష్టి సారించింది. బ్రిటన్‌లో స్ట్రెయిన్‌ విజృంభణకు సంబంధించిన తాజా పరిస్థితులను జర్మనీ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై నెదర్లాండ్‌, బెల్జియం దేశాలు నిషేధం పెట్టింది.

దీంతో జర్మన్‌ ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తోంది. కాగా, జర్మనీలో ఇప్పటివరకు కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసులేవీ గుర్తించలేదని ప్రముఖ వైరాలజీ విభాగ వైద్యుడు క్రిస్టియన్‌ డ్రోస్టెన్‌ వెల్లడించారు.

యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోందంటూ.. లండన్‌లో అక్కడి ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే బెల్జియం, నెదర్లాండ్‌ దేశాలు ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.