అమెరికాను కప్పేసిన మంచు దుప్పటి.. ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న తుఫాన్.. క్రిస్మస్ పండుగపై ప్రభావం

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను మంచు తుపాను కుదిపేసింది. పెద్ద ఎత్తున కురిసిన మంచు.. రోడ్లను, ఇళ్లను కప్పివేసింది. ఈ తుఫాను కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

అమెరికాను కప్పేసిన మంచు దుప్పటి.. ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న తుఫాన్.. క్రిస్మస్ పండుగపై ప్రభావం
Follow us

|

Updated on: Dec 20, 2020 | 11:49 PM

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను మంచు తుపాను కుదిపేసింది. పెద్ద ఎత్తున కురిసిన మంచు.. రోడ్లను, ఇళ్లను కప్పివేసింది. ఈ తుఫాను కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా తూర్పు తీరానికి జనం భారీగా చేరుకుంటున్నారు. దీంతో మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో తూర్పు – మధ్య అమెరికా ద్వారా ప్రయాణించేవారు జాగ్రత్త తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు క్రిస్మస్ పండుగు పురస్కరించుకుని సహాయక చర్యలు చేసి రవాణా వ్యవస్థను పునరుద్దరిస్తున్నారు అధికారులు.

ఈ సీజన్ లో శీతల గాలుల ప్రభావం అమెరికాపై బాగానే కనిపిస్తోంది. ఈ వారంలో వచ్చే క్రిస్మస్ పండుగపై కొత్త తుఫాను ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. శనివారం తూర్పు అమెరికా నుంచి వీస్తున్న చల్లటి గాలులతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఓహియో నగరం నుండి న్యూయార్క్ వరకు మంచు దుప్పటి కప్పేసింది. ఆదివారం I-95 కారిడార్‌కు మంచు జల్లులు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో ప్రజలు మంచుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనడాను మంచు తుఫాన్ వణికిస్తోంది. అటు ఎగువ మిడ్వెస్ట్కు మంచు భారీగా కురుస్తోంది.

మరోవైపు, మిన్నెసోటా నుంచి వర్జీనియా వరకు మొత్తం 12 రాష్ట్రాలు ఈ తుపాను బీభత్సానికి గురయ్యాయని సమాచారం. మోంటానాలో 2 అడుగుల మేర మంచు కప్పేసింది. ఇక నార్త్ డకోటాలో 15 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయిందని తెలుస్తోంది. కాగా, అత్యధిక జనాభా కలిగిన నగరం చికాగోలో గంటకు ఓ అంగుళం చొప్పున మంచు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం తుపాను బాధిత ప్రాంతాల్లో అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

అటు వాయువ్య ప్రాంతంలో మంచు తుఫాను భారీ వర్షాన్ని కురిపిస్తోంది. ఒరెగాన్, వాషింగ్టన్ వంటి ప్రాంతాల్లో 8 అంగుళాల వరకు మంచుతో కూడిన వర్షం పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బురదజల్లులు, కొండచరియలు, హిమపాతాలను రేకెత్తిస్తుందని, కొన్ని చోట్ల వరదలు కూడా సంభవించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచు అల్ప పీడనం ఏర్పడి తుఫాన్ గా మారే అవకాశముంది. దీనివల్ల ఎగువ మిడ్‌వెస్ట్ భాగాలలో మంచు విస్ఫోటనం చెందుతుందని అధికారులు వెల్లడించారు.

ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
ఆంటీ వండిన 'అవతార్‌ బిర్యానీ'.. వీడియో వైరల్
ఆంటీ వండిన 'అవతార్‌ బిర్యానీ'.. వీడియో వైరల్
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..