AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arthur Urso: ఇతడు మాములోడు కాదు. ఇప్పటికే తొమ్మిది పెళ్లిళ్లు.. నలుగురికి విడాకులు.. ఇప్పుడు మళ్లీ

బ్రెజిల్‌ లోని సావోపాలోకి చెందిన ఆర్థర్ ఓ ఉర్సో మోడల్. అతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే తొమ్మది మంది భార్యల్లో నలుగురికి విడాకులు ఇచ్చాడు. ఇది అప్పట్లో పెను సంచలనం...

Arthur Urso: ఇతడు మాములోడు కాదు. ఇప్పటికే తొమ్మిది పెళ్లిళ్లు.. నలుగురికి విడాకులు.. ఇప్పుడు మళ్లీ
Brazil Model Arthur
Ganesh Mudavath
|

Updated on: Dec 02, 2022 | 8:43 AM

Share

బ్రెజిల్‌ లోని సావోపాలోకి చెందిన ఆర్థర్ ఓ ఉర్సో మోడల్. అతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే తొమ్మది మంది భార్యల్లో నలుగురికి విడాకులు ఇచ్చాడు. ఇది అప్పట్లో పెను సంచలనం కలిగించింది. తాజాగా తాను మళ్లీ చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఒకరిని ప్రేమించి, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని జీవితాంతం వారితోనే గడపాలన్న మాటకు తాను వ్యతిరేకమని చెప్పడం గమనార్హం. ఎంతమందినైనా ప్రేమించండి.. వారిని పెళ్లి చేసుకోండి అనే మాటను ప్రజల్లో తీసుకెళ్లేందుకు తాను ఈ విధంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే బ్రెజిల్‌లో బహుభార్యత్వం చట్టవిరుద్ధం. అయినా అనధికారికంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఉర్సో మొదట ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రేమను పంచాలి.. ప్రపంచమంతా ప్రేమ మయం కావాలి అనే సందేశం వినిపిస్తూ మరో 8 మందిని ఒకేసారి చర్చిలో పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యలకు ఇబ్బంది కలగకుండా టైమ్‌ని 9 మంది భార్యలకు సమానంగా పంచాడు. కొన్ని నెలల తర్వాత 9 మందిలో ఓ యువతి ఈ బంధంపై అభ్యంతరం చెప్పింది. తనకు నచ్చలేదంటూ విడాకులు ఇచ్చేసింది. దాంతో భార్యల సంఖ్య 8కి తగ్గింది. మరో ఇద్దర్ని పెళ్లి చేసుకుంటే 10కి చేరుతుందని ప్రకటించాడు. అయితే 8 మంది భార్యల్లో మరో నలుగురు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దాంతో ఉర్సో.. ఆ నలుగురికి విడాకులు ఇచ్చేశాడు. అంతే కాకుండా మరో నలుగురిని పెళ్లాడతానని చెబుతున్నాడు. తనకు ఇప్పుడు అధికారికంగా నలుగురు భార్యలే ఉన్నారని చెబుతున్నాడు ఉర్సో..

అయితే.. ఉర్సోకు డబ్బు ఎలా వస్తుందో తెలుసా.. ఇతను ఓన్లీ ఫ్యాన్స్ అడల్ట్ సైట్‌లో ఉంటాడు. అడల్ట్ ఫొటోలు, వీడియోలూ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఇతనిపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. అడల్ట్ సైట్‌లో అసహ్యకరమైన పనులు చేస్తున్నాడని పలువురు మండిపడుతున్నారు. ఆ డబ్బు కోసమే ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. కాగా.. ఉర్సో తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. పది మందిని పెళ్లి చేసుకోవడం అనేది తన కల అనీ ఎప్పటికైనా దాన్ని సాధిస్తానని చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..